- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్రహ్మపుత్ర నదిపై డ్యాం నిర్మాణం ప్రారంభించిన చైనా.. భారత్‌కు కష్టమే?
బ్రహ్మపుత్ర నదిపై డ్యాం నిర్మాణాన్ని చైనా ప్రారంభించింది. దీంతో భారత్‌కు కష్టమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: టిబెట్‌లోని యార్లుంగ్ సాంగ్‌పో నదిపై (బ్రహ్మపుత్ర నది) భారీ డ్యాం నిర్మాణాన్ని చైనా ప్రారంభించింది. చైనీస్ ప్రీమియర్ లీ కియాంగ్ ఈ ప్రాజెక్టును శనివారం లాంచ్ చేశారు. ఏకంగా 1.2 ట్రిలియన్ యవాన్లు (167 బిలియన్ డాలర్లు) పెట్టుబడితో ఈ ప్రాజెక్టును చైనా నిర్మిస్తోందని సమాచారం. ఈ ప్రాజెక్టు ద్వారా ఉత్పత్తి చేసే పవర్‌ను టిబెట్‌తో పాటు మిగతా ప్రాంతాలకు కూడా సరఫరా చేయాలని డ్రాగన్ కంట్రీ భావిస్తోంది. ఈ మెగా ప్రాజెక్టుతో చైనా ఆర్థిక వ్యవస్థకు మంచి బూస్ట్ ఇవ్వాలని అనుకుంటోంది.
అయితే బ్రహ్మపుత్ర నదిపై ఇంత భారీ ప్రాజెక్టు కట్టడం కచ్చితంగా భారత్, చైనా మధ్య దౌత్యపరమైన సమస్యలకు దారి తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ప్రాజెక్టు సమస్యాత్మకంగా మారుతుందని, ఇది సరైన నిర్ణయం కాదని భారత్ కూడా పలుమార్లు అభ్యంతరాలు వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే. అరుణాచల్ ప్రదేశ్ సీఎం కూడా ఇదొక ‘వాటర్ బాంబ్’లా మారుతుందని ఇటీవలే షాకింగ్ కామెంట్స్ చేశారు. కానీ నది దిగువన ఉన్న ప్రాంతాలకు ఈ డ్యాం వల్ల ఎలాంటి సమస్య రాదని చైనా వాదిస్తోంది.






