China : అమెరికాకు షాకిచ్చిన చైనా.. అవన్నీ నిలిపివేత

by Yella Dhawani Reddy |

ప్రస్తుతం ప్రపంచంలో ట్రేడ్ వార్(Trade War) జరుగుతున్న సంగతి తెలిసిందే.

China : అమెరికాకు షాకిచ్చిన చైనా.. అవన్నీ నిలిపివేత
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రస్తుతం ప్రపంచంలో ట్రేడ్ వార్(Trade War) జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ట్రేడ్ వార్ లో ఒకరి మీద ఒకరు ఎత్తుకు పై ఎత్తులు వేస్తోంది అమెరికా చైనా(America VS China) అనే చెప్పుకోవాలి. ఆ రెండు దేశాల అధ్యక్షులు పరస్పర టాక్స్ టారిఫ్(Tax tariff) లు పెంచుకుంటూ పోతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) చైనా ఉత్పత్తులపై 145 శాతం టారిఫ్ లను పెంచగా.. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్(Jin Ping) ఏ మాత్రం తగ్గకుండా అమెరికా ఉత్పత్తులపై 125 టారిఫ్ లు పెంచారు. ఈ విషయంలో చైనా అడుగు ముందుకు వేసి అమెరికాకు కీలక లోహాల ఎగుమతిని నిలిపివేసింది. అరుదైన భూగర్భ లోహాలు, మాగ్నెట్ లను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది డ్రాగన్ దేశం.

అయితే ఆయుధాలు, ఎలక్ట్రానిక్స్, ఆటోమేకర్స్, ఏరోస్పేస్, సెమీకండక్టర్ల కంపెనీలకు కావాల్సిన అతి ముఖ్యమైన అరుదైన లోహాలు చైనాలో మాత్రమే లభ్యం అవుతుండగా.. చైనా ఎగుమతులపై పెంచిన టారిఫ్ లకు రీవెంజ్ గా ఆయా ముఖ్య లోహాలను అమెరికాకు ఎగుమతి చేయకూడదని నిర్ణయం తీసుకుంది. ఈ లోహాల ఎగుమతిపై ఏకంగా కొత్త నియంత్రణ వ్యవస్థను కూడా చైనా ప్రవేశ పెట్టిందని సమాచారం. ఈ దెబ్బతో అమెరికా దిగివస్తుందా లేదా చూడాలి మరి.

Next Story