చైనాలో మరో వైరస్.. కోవిడ్‌ను పోలి ఉన్నట్లు గుర్తింపు

by Ajay Maddhiboyina |

అయితే ఈ వైరస్ ఎక్కడ పుట్టిందో మాత్రం ఇంకా పూర్తి వివరాలు తెలియరాలేదని పరిశోధకులు చెప్పారు.

చైనాలో మరో వైరస్.. కోవిడ్‌ను పోలి ఉన్నట్లు గుర్తింపు
X

- హెచ్‌కేయూ5-కోవ్-2గా నామకరణం

దిశ, నేషనల్ బ్యూరో: ప్రపంచం మరో పాండమిక్‌ను చూడబోతోందా? కోవిడ్‌ను పోలిన మరో కొత్త వైరస్‌ విజృంభించబోతోందా? అంటే చైనా పరిశోధకులు అవుననే అంటున్నారు. చైనాలోని పరిశోధకుల బృందం గబ్బిలాల్లో కొత్త వైరస్‌ను కనుగొన్నారు. ఇది జంతువుల నుంచి మనుషులకు సోకే ప్రమాదం ఉందని వారు హెచ్చరించారు. ఈ వైరస్ కూడా కోవిడ్-19నే పోలి ఉందని, దీనికి హెచ్‌కేయూ -కోవ్-2గా నామకరణం చేసినట్లు తెలిపారు. బ్యాట్ వుమెన్‌గా పిలవబడే ప్రముఖ వైరాలజిస్ట్ షి ఝెంగ్‌లీ సారథ్యంలోని బృందం చేసిన పరిశోధనకు సంబంధించిన పరిశోధనా పత్రంలో ఈ విషయాన్ని వెల్లడించారు. చైనాలో ఫ్లూను పోలిన హెచ్ఎంపీవీ కేసులు పెరిగిన తర్వాత ఈ పరిశోధనా పత్రం వెలుగు చూడటం మరింత ఆందోళనకరంగా మారింది. కాగా, ఈ వైరస్ మైర్బెకోవైరస్‌తో పాటు ప్రాణాంతక మెర్స్-కోవ్ రకానికి చెందినదిగా పరిశోధకులు గుర్తించారు. ఈ వైరస్ కూడా కరోనా జాతికి చెందిందిగా పరిశోధకులు పేర్కొన్నారు. తాజా పరిశోధన ప్రకారం ఈ వైరస్ నేరుగా లేదా ఇతర జీవుల నుంచి మనుషులకు వ్యాపించే అవకాశం ఉందని హెచ్చరించారు. అయితే ఈ వైరస్ ఎక్కడ పుట్టిందో మాత్రం ఇంకా పూర్తి వివరాలు తెలియరాలేదని పరిశోధకులు చెప్పారు.

Next Story