- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
China: ప్రతీకార సుంకాలను పూర్తిగా రద్దు చేయాలి.. చైనా వాణిజ్య శాఖ డిమాండ్
ఎలక్ట్రానిక్ వస్తువులకు టారిఫ్స్ నుంచి మినహాయింపు ఇస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో చైనా స్పందించింది.

దిశ, నేషనల్ బ్యూరో: స్మార్ట్‌ఫోన్లు (Smart phones), ల్యాప్‌టాప్‌లు (Lap tops) ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులకు టారిఫ్‌ల నుంచి మినహాయింపు ఇస్తూ యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో చైనా (China) వాణిజ్య శాఖ స్పందించింది. అమెరికా తన పరస్పర సుంకాలను పూర్తిగా రద్దు చేయాలని విజ్ఞప్తి చేసింది. ‘అమెరికా తన తప్పులను సరిదిద్దు కోవాలి. పరస్పర సుంకాల పద్దతిని పూర్తిగా రద్దు చేయాలి. సరైన మార్గానికి తిరిగి రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. పులి మెడలోని గంటను దానిని కట్టిన వ్యక్తి మాత్రమే తీయగలడు’ అని తెలిపింది.
చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ చేశారు. ట్రంప్ దూకుడు చర్యల వల్ల విదేశాలు కాదు సామాన్య పౌరులు నష్టపోతారు. ఎందుకంటే టారిఫ్‌ల వల్ల దిగుమతి చేసుకున్న వస్తువుల ధరలు పెరిగి వినియోదారులపై భారం పడుతుంది’ అని పేర్కొన్నారు. అమెరికా కంపెనీలే టారిఫ్‌లు చెల్లించి ఆ భారాన్ని పౌరులపై మోపుతాయని తెలిపారు. కాబట్టి సుంకాలను రద్దు చేయాలని సూచించారు. కాగా, ట్రంప్ టారిఫ్‌ల ప్రకటన నేపథ్యంలో యూఎస్, చైనా మధ్య వాణిజ్య యుద్ధం నెలకొన్న విషయం తెలిసిందే. దీనిపై చైనా మొదట్లో కఠిన వైఖరిని ప్రదర్శించగా తాజా విజ్ఞప్తితో దిగి వచ్చినట్టు కనిపిస్తోంది.






