చైనా యుద్ధానికి సిద్ధమవుతోంది: Rahul Gandhi సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 19 |
చైనా యుద్ధానికి సిద్ధమవుతోంది: Rahul Gandhi సంచలన వ్యాఖ్యలు
X

జైపూర్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. సరిహద్దుల్లో చైనా యుద్ధానికి సన్నద్ధమవుతుంటే కేంద్రం ఏ విషయాన్ని కూడా స్వీకరించట్లేదని ఆరోపించారు. శుక్రవారం భారత్ జోడో యాత్ర 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా జైపూర్‌లో మీడియాతో మాట్లాడారు. 'చైనా యుద్ధానికి సిద్ధమవుతోంది. చొరబాటు కోసం కాదు. వారి ఆయుధాలను చూడండి. వారు యుద్ధానికి సిద్ధమవుతున్నారు. మన ప్రభుత్వం దానిని అంగీకరించడం లేదు. భారత ప్రభుత్వం వ్యూహాలపై కాకుండా సంఘటనలపై పనిచేస్తోంది' అని విమర్శించారు. చైనా మన భూభాగాన్ని లాక్కొని సైనికులపై దాడులు చేస్తుందని ఆరోపించారు. అరుణాచల్ ప్రదేశ్‌లో వాస్తవ నియంత్రణ రేఖ వద్ద ఇరు దేశాల మధ్య ఘర్షణ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

క్రమపద్ధతిలో దుష్ఫ్రచారం..

తనపై, పార్టీపై క్రమ పద్ధతితో దుష్ప్రచారం జరుగుతుందని రాహుల్ గాంధీ అన్నారు. తమ పార్టీలో ఎలాంటి నియంత విధానంగానీ, ఉన్మాదంగానీ లేదని చెప్పారు. తన పార్టీ సామర్థ్యంపై రాహుల్ విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేరని ఉద్ఘాటించారు. కాంగ్రెస్ పార్టీ బీజేపీని పడగొడుతుందని, తన మాటలను గుర్తుంచుకోవాలని అన్నారు. తనపై దుష్ప్రాచార కార్యక్రమం గురించి తెలుసని చెప్పారు. అయితే దానిని పట్టించుకోనని అన్నారు. బీజేపీ అజెండా విద్వేషం, విభజన నియమంతో తాను అంగీకరించనని చెప్పారు. కాంగ్రెస్ బీజేపీ విజన్‌తో పోరాడాలని, ముఖ్యంగా తన రంగులను కొనసాగించాలని అన్నారు.

గుజరాత్ ఎన్నికల్లో ఆప్ పోటీ చేయకుంటే తాము బీజేపీని ఓడించే వారిమని అన్నారు. కేజ్రీవాల్ పార్టీ కాషాయ పార్టీకి ప్రాక్సీ అని విమర్శించారు. బీజేపీ విభజన రాజకీయాలు ప్రజలకు అర్థమైన రోజు.. కాంగ్రెస్ ప్రతి ఎన్నికల్లో విజయం సాధిస్తుందని పేర్కొన్నారు. మరోవైపు కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర శుక్రవారంతో 100 రోజుల పూర్తి చేసుకుంది. తమిళనాడు కన్యాకుమారిలో సెప్టెంబర్ 7న ఈ యాత్ర ప్రారంభం కాగా, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల గుండా సాగింది.


Next Story

Most Viewed