Cash Reward: ప్లీజ్ పిల్లల్నికనండి.. జంటలకు నగదు నజరానా ప్రకటించిన ప్రభుత్వం

by Prasad Jukanti |

తగ్గుతున్న జనాభా పరిస్థితిని అధిగమించేందుకు చైనా కొత్త పథకాన్ని తీసుకువచ్చింది.

Cash Reward: ప్లీజ్ పిల్లల్నికనండి.. జంటలకు నగదు నజరానా ప్రకటించిన ప్రభుత్వం
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలో జనాభా సంక్షోభాన్ని అధిగమించేందుకు చైనా (China) ప్రభుత్వం తమ ప్రజలకు బంపరాఫర్లు ఇస్తోంది. గతంలో ఇబ్బడిముబ్బడిగా పెరిగిన జనాభాను కంట్రోల్ చేసేందుకు ఆంక్షలు విధించిన డ్రాగన్ కంట్రీ.. ఇప్పుడు దేశ జనాభాను పెంచేందుకు (population growth) ఆపసోపాలు పడుతోంది. ఈ క్రమంలో పిల్లలను కనాలంటూ ప్రోత్సహిస్తోంది. పిల్లల్ని కంటే నగదు బహుమతి ఇస్తామంటూ తాజాగా ప్రకటించింది. ఒక్కో బిడ్డకు ఏడాదికి రూ. 42 వేలు ఇవ్వాలని ఇలా ఆ బిడ్డకు మూడేళ్లు వచ్చే వరకు ఈ నగదు ప్రోత్సాహకం అందించేందుకు చైనా ప్రభుత్వం సిద్ధమైనట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ సంవత్సరం జనవరి 1న లేదా ఆ తర్వాత జన్మించిన ప్రతి బిడ్డకు మూడేళ్లు నిండే వరకు ఈ స్కీమ్ అమలు చేస్తామని అక్కడి జంటలకు చైనా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.

అయితే పిల్లల్ని కనే మాట అటుంచితే చైనా యువత పెళ్లిపై ఆసక్తి కూడా చూపకపోవడం డ్రాగన్ కంట్రీని మరింత కలవరపెడుతోంది. దీంతో యువతలో పెళ్లిపై ఆస్తి పెంచేలా గతంలోనే ఓ పథకాన్ని తీసుకువచ్చింది. 25 ఏళ్ల సంవత్సరాలు లేదా అంతకన్న తక్కువ వయసు ఉన్న యువతులు పెళ్లిళ్లు చేసుకుంటే వారికి 137 డాలర్ల రివార్డు ఆఫర్ ను ప్రకటించిది. యువతులు త్వరగా పెళ్లి చేసుకుని పిల్లల్ని కనేలా ప్రోత్సహించే చర్యల్లో భాగంగా చైనా ప్రభుత్వం గతంలోనే ఈ నిర్ణయం తీసుకోగా తాజాగా పుట్టిన బిడ్డలకు క్యాష్ రివార్డు ఇస్తామని ప్రకటించింది. ప్రభుత్వం ఇంత చేసినా చైనా యువతీయువకులు మాత్రం జనాభాను కనే విషయంలో నిరాసక్తి చూపడం గమనార్హం. దీంతో జనాభాను పెంచేందుకు పొరుగు దేశం కొత్త పథకాలు అమలు చేసేందుకు సిద్ధం అవుతోంది.

Next Story