- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
China launch satellites from a ship : సముద్రం మధ్యలో షిప్ నుంచి శాటిలైట్ ప్రయోగించిన చైనా
చైనా అంతరిక్ష ప్రయోగాల్లో మరో కీలక మైలురాయిని చేరుకుంది.

దిశ, నేషనల్ బ్యూరో : చైనా అంతరిక్ష ప్రయోగాల్లో మరో కీలక మైలురాయిని చేరుకుంది. సముద్రం మధ్యలో షిప్ నుంచి స్మార్ట్ డ్రాగన్-3 శాటిలైట్‌ను సోమవారం ప్రయోగించింది. షాన్‌డాంగ్ ప్రావిన్స్‌లోని హయాంగ్ సమీపంలో ఈ ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టింది. రాకెట్‌ను టెన్ సెంటీ స్పేస్-01 శాటిలైట్ సముహంలోని నిర్దేశిత కక్ష్యలోకి చైనా పంపింది. తైవాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ ఈ ప్రయోగాన్ని నిర్వహించింది. 31 మీటర్ల పొడవు, 140 టన్నుల బరువుతో స్మార్ట్ డ్రాగన్-3ని చైనా అకాడమీ ఆఫ్ లాంచ్ వెహికల్ టెక్నాలజీ రూపొందించింది. తక్కువ కక్ష్యలో ఉండే చిన్న కమర్షియల్ శాటిలైట్‌లను ప్రయోగించడానికి పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి డ్రాగన్-3ని చైనా రూపొందించింది. స్మార్ట్ డ్రాగన్-3 మోసుకెళ్లే పేలోడ్‌లో అంతరిక్ష పర్యావరణ డేటా సేకరణ, ఇంటర్ శాటిలైట్ లేజర్ నెట్ వర్కింగ్ పరీక్షల కోసం ఉపయోగించే ఉపగ్రహాలు ఉన్నాయి. 1600 కిలోల భారీ పేలోడ్‌ను ఈ మిషన్‌లో వినియోగించారు. 2019 నుంచి హయాంగ్ 15 సముద్ర మిషన్లను సమర్ధంగా నిర్వహించింది. మొత్తం 89 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపింది.






