- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాక్‌ను చైనా ఒక ల్యాబ్‌లా వాడుకుంటోంది: భారత ఆర్మీ
పాకిస్థాన్-చైనా (Pakistan-China) బంధంపై భారత ఆర్మీ (Indian army) తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

దిశ, వెబ్ డెస్క్: పాకిస్థాన్-చైనా (Pakistan-China) బంధంపై భారత ఆర్మీ (Indian army) తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పాకిస్థాన్‌కు చెందిన 81 శాతం మిలిటరీ హార్డ్‌వేర్ చైనా సరఫరా చేసినదేనని డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ ఆర్ సింగ్ వెల్లడించారు. ఇటీవల పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ నిర్వహించిన 'ఆపరేషన్ సిందూర్' సమయంలో చైనా నుంచి పాక్‌కు ఎలక్ట్రానిక్ నిఘా, ఆయుధాల మద్దతుతో పాటు సాయుధ సమాచారం అందించబడిందని ఆయన ఆరోపించారు. 'చైనా తన మిలిటరీ సాంకేతికతను పరీక్షించుకోవడానికి పాక్‌ను ఒక ప్రయోగశాలగా ఉపయోగిస్తోంది. మనకు ముగ్గురు శత్రువులు ఉన్నారని చెప్పాలి. పాకిస్థాన్, చైనా, మరికొంతమంది విదేశీ మద్దతుదారులు' అని సింగ్ వెల్లడించారు.
సరిహద్దుల్లో ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో భారత్ గూఢచర్య, సాంకేతిక సమాచార ఆధారంగా ముందస్తు ప్రణాళికలతో 21 లక్ష్యాలను గుర్తించి, అందులో తొమ్మిదింటిపై విజయవంతంగా దాడులు నిర్వహించిందని వివరించారు.ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ దాడులకు అనుసరించిన వ్యూహాలు, ఎత్తుగడలపై సమాచారం బీజింగ్ నుంచి ఇస్లామాబాద్‌కు తక్షణం చేరిందని ఆర్మీ అధికార ప్రతినిధి వెల్లడించారు.
కాగా, స్టాక్‌హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (SIPRI) గణాంకాల ప్రకారం, 2015 నుంచి పాక్‌కు చైనా 8.2 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలను పాక్‌కు చైనా విక్రయించింది. 2020–24 మధ్య చైనా మొత్తం ఆయుధ ఎగుమతుల్లో 63 శాతం పాకిస్థాన్‌దే కావడం గమనార్హం. భారత్ చేపట్టిన క్షిపణి దాడుల ముందు చైనా నుంచి వచ్చిన HQ-9, LY-80 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు ఒక్క క్షిపణినీ అడ్డుకోలేకపోయింది. దీంతో ఘర్షణకు తెరపడుతూ కాల్పుల విరమణ కోసం పాక్ ముందుకొచ్చినట్టు సమాచారం.






