- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
China: చైనా పౌరులకు భారత్ టూరిస్ట్ వీసాలు.. ఐదేళ్ల తర్వాత గ్రీన్ సిగ్నల్
చైనా పౌరులకు టూరిస్ట్ వీసాలు ఇచ్చేందుకు భారత్ అంగీకరించింది. బీజింగ్‌లోని భారత రాయబార కార్యాలయం ఈ విషయాన్నివెల్లడించింది.

దిశ, నేషనల్ బ్యూరో: చైనా పౌరులకు టూరిస్ట్ వీసా (Toorist visa) లు ఇచ్చేందుకు భారత్ అంగీకరించింది. గురువారం నుంచి వీసా జారీ ప్రక్రియ ప్రారంభిస్తామని బీజింగ్‌లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. చైనా సిటిజన్స్ భారత్‌ను సందర్శించేందుకు వీసా కోసం ధరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. ఐదేళ్ల తర్వాత పర్యాటక వీసాలు ఇవ్వడం ఇదే మొదటి సారి. 2020లో కొవిడ్ మహమ్మారిని అరికట్టే ప్రయత్నంలో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా టూరిస్ట్ వీసాలు జారీ చేయడాన్ని భారత్ నిలిపివేసింది. అనంతరం అనేక దేశాలపై ఆంక్షలు ఎత్తివేసినప్పటికి చైనాపై మాత్రం నిషేధం కొనసాగించింది. గాల్వన్ లోయ ఘర్షణ తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణించడంతో బ్యాన్ అలాగే ఉంది. తాజాగా ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడుతున్న నేపథ్యంలో టూరిస్ట్ వీసాలు ఇచ్చేందుకు భారత్ సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇటీవల విదేశాంగ మంత్రి చైనాలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కీలక నిర్ణయం వెలువడడం గమనార్హం.






