China- Gold: నక్క తోక తొక్కిన డ్రాగన్.. చైనాలో బయటపడిన 168 టన్నుల బంగారం గనులు

by Vennela |

Yellow Metal Found in China : డ్రాగన్ కంట్రీ మరో జాక్ పాట్ కొట్టింది.

China- Gold: నక్క తోక తొక్కిన డ్రాగన్.. చైనాలో బయటపడిన  168 టన్నుల బంగారం గనులు
X

దిశ, వెబ్ డెస్క్ : Yellow Metal Found in China : డ్రాగన్ కంట్రీ మరో జాక్ పాట్ కొట్టింది. చైనాలోని 168 టన్నుల బంగారం గనులను గుర్తించినట్లు చైనా మీడియా పేర్కొంది. గతేడాది నవంబర్ లో హునాన్ ప్రావిన్స్ లో ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు నిక్షేపాన్ని చైనా గుర్తించి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.

భారత్ పొరుగు దేశం చైనా(China)లో మరో భారీ బంగారు(gold mines) నిక్షేపం బయటపడింది. దీంతో చైనా మరో జాక్ పాట్ కొట్టినట్లే చెప్పవచ్చు. చైనాలో 168 టన్నుల బంగారం గనులను గుర్తించిన చైనా మీడియా పేర్కొంది. చైనా సహజ వనరుల మంత్రిత్వ శాఖ ప్రకారం, బంగారు నిక్షేపాలు గన్సు ప్రావిన్స్ (వాయువ్య చైనా), ఇన్నర్ మంగోలియా (ఉత్తర చైనా) హీలాంగ్జియాంగ్ ప్రావిన్స్ (ఈశాన్య చైనా)లో గుర్తించినట్లు తెలిపింది. మొత్తం పసుపు లోహం 168 టన్నులు ఉన్నట్లు చైనా మీడియా పేర్కొంది.

గతేడాది నవంబర్‌లో హునాన్ ప్రావిన్స్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు నిక్షేపం బయటపడటంతో.. చైనా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. పింగ్జియాంగ్ కౌంటీకి సమీపంలో ఉన్న అధిక-నాణ్యత కలిగిన ముడి ఖనిజమని పేర్కొంటారు. సుమారు 1,000 మెట్రిక్ టన్నుల బంగారం ఉన్నట్లు చైనా పేర్కొంది. దీని విలువ USD 83 బిలియన్ (సుమారు 7 లక్షల కోట్లు) కంటే ఎక్కువ.చైనాలోని బంగారు గని దక్షిణాఫ్రికాలోని సౌత్ డీప్ గనిని అధిగమించింది. ఈ గని గతంలో అతిపెద్ద గనిగా ఉండేది. అందులో 900 మెట్రిక్ టన్నుల బంగారం ఉంది. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం, అత్యధిక బంగారు నిల్వలు కలిగిన మొదటి మూడు దేశాలు అమెరికా, జర్మనీ, ఇటలీలు ఉన్నాయి.

2,264 టన్నుల బంగారం నిల్వలతో చైనా ఆరో స్థానంలో ఉంది. ఇక భారతదేశంలో 840. 76 టన్నుల బంగారం ఉంది. గ్లోబల్ గోల్డ్ ఉత్పత్తిలో ఆధిపత్యం చెలాయిస్తూ, ప్రపంచంలోని ప్రముఖ బంగారు ఉత్పత్తిదారుగా చైనా తన స్థానాన్ని నిలబెట్టుకుంది. 375 టన్నుల ఉత్పత్తి అంచనాతో, చైనాలో విస్తృతమైన మైనింగ్ కార్యకలాపాల కారణంగా 2022లో ప్రపంచ బంగారం ఉత్పత్తిలో చైనా 10 శాతం వాటాను కలిగి ఉంది. అటు పాకిస్తాన్ లోనూ బంగారం గనులను గుర్తించారు. సింధునదిలో ఈ బంగారు నిక్షేపాలు ఉన్నట్లు పాకిస్తాన్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. కళ్లు చెదిరే రీతిలో బంగారం నిల్వలు గుర్తించడంతో పాకిస్తాన్ కష్టాల నుంచి గట్టెక్కినట్లే అని అంటున్నారు నిపుణులు.

ఇక ప్రపంచం గోల్డ్ మార్కెట్ ను డ్రాగన్ కంట్రీ శాసించే రోజులు రాబోతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే బంగారం ఉత్పత్తిలో చైనాదే కీలక పాత్ర అని చెప్పవచ్చు. ప్రపంచమంతా ఏటా ఉత్పత్తయ్యే బంగారంలో చైనా వాటా 10శాతం ఉంటుంది. ఇక నుంచి అది మరింత పెరకబోతోంది. రోజు రోజుకు బంగారం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో చైనా భారీగా లబ్ది పొందనుంది.

Next Story