- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
China: చైనా మాజీ మంత్రికి మరణశిక్ష.. ఆ దేశ న్యాయస్థానం సంచలన తీర్పు ?
చైనాలో మాజీ వ్యవసాయ, గ్రామీణ వ్యవహారాల శాఖ మంత్రి టాంగ్ రెన్‌జియాన్‌కు మరణశిక్ష విధిస్తూ ఓ కోర్టు తీర్పు వెలువరించింది.

దిశ, నేషనల్ బ్యూరో: చైనాలో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఆ దేశ మాజీ వ్యవసాయ, గ్రామీణ వ్యవహారాల శాఖ మంత్రి టాంగ్ రెన్‌జియాన్ (Tang Renjian) కు మరణశిక్ష విధిస్తూ జిలిన్ ప్రావిన్స్‌లోని ఓ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. 2007 నుంచి 2024 వరకు టాంగ్ వివిధ పదవులు నిర్వహించారు. ఈ క్రమంలోనే 268 మిలియన్ యువాన్లు (రూ.334 కోట్లు) లంచం తీసుకున్నారని ఆరోపణలున్నాయి. దీంతో ఆయనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు ఆయనపై మోపిన అభియోగాలు రుజువు కావడంతో మరణశిక్ష విధించింది. అయితే ఆయన తన నేరాలకు అంగీకరించి విచారణకు సహకరించారని పేర్కొంటూ మరణశిక్షను రెండేళ్లపాటు నిలిపివేసింది. అంటే రెండేళ్లలోపు అతను ఎటువంటి కొత్త నేరాలకు పాల్పడకపోతే ఆయన శిక్షను జీవిత ఖైదుగా మార్చే అవకాశం ఉంటుంది. అవినీతి ఆరోపణలు రావడంతో 2024 నవంబర్‌లో చైనా కమ్యూనిస్ట్ పార్టీ టాంగ్‌ను పార్టీ నుంచి బహిష్కరించింది. ఆరు నెలల తర్వాత ఆయనను పదవి నుంచి తొలగించింది. అప్పటి నుంచి కేసు విచారణలో ఉండగా తాజాగా న్యాయస్థానం తీర్పు వెల్లడించింది.






