China: దలైలామా వారసత్వం మా అంతర్గత అంశం.. జైశంకర్ పర్యటన వేళ చైనా వ్యాఖ్యలు

by B.Srinivas |

విదేశాంగ మంత్రి జైశంకర్ చైనాలో పర్యటించనున్న వేళ ఆ దేశం కీలక వ్యాఖ్యలు చేసింది.

China: దలైలామా వారసత్వం మా అంతర్గత అంశం.. జైశంకర్ పర్యటన వేళ చైనా వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: విదేశాంగ మంత్రి జైశంకర్ (Jai shanker) చైనాలో పర్యటించనున్న వేళ ఆ దేశం కీలక వ్యాఖ్యలు చేసింది. దలైలామా వారసత్వం, టిబెట్ సంబంధిత అంశాలు భారత్ చైనాల ద్వైపాక్షిక సంబంధాలకు ముల్లుగా మారాయని తెలిపింది. భారత్‌లోని చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి యు కింగ్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. మాజీ అధికారులతో సహా పలువురు సభ్యులు దలైలామా పునర్జన్మకు సంబంధించి భారత ప్రభుత్వ వైఖరికి విరుద్ధంగా అనుచిత వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. టిబెట్‌కు సంబంధించిన సమస్యల సున్నితత్వాన్ని వారు పూర్తిగా తెలుసుకోవాలని సూచించారు. దలైలామా వారసత్వం స్వాభావికంగా చైనా అంతర్గత వ్యవహారమని, ఈ విషయంలో ఎటువంటి బాహ్య శక్తుల జోక్యాన్ని సహించబోదని తెలిపారు.

జిజాంగ్ సంబంధిత అంశం చైనా-భారత్ సంబంధాలలో భారంగా మారిందన్నారు. కాగా, జైశంకర్ ఈ నెల 14,15 తేదీల్లో చైనాను సందర్శించనున్నారు. షాంఘై సహకార సంస్థ (SCO) విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యితో భేటీ కానున్నారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు.

Next Story