- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇండియా, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు... చైనా కీలక ప్రకటన
ఇండియా ( India ) వర్సెస్ పాకిస్తాన్ (Pakishan) మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో... పక్క దేశమైన చైనా ( China)

దిశ వెబ్ డెస్క్ : ఇండియా ( India ) వర్సెస్ పాకిస్తాన్ (Pakishan) మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో... పక్క దేశమైన చైనా ( China) కీలక ప్రకటన చేసింది. రెండు దేశాల మధ్య జరుగుతున్న పరిణామాలను... మొదటి నుంచి గమనిస్తున్నామని చైనా వెల్లడించింది. పహల్గామ్ దాడి నేపథ్యంలో.. ఢిల్లీ అలాగే ఇస్లామాబాద్ మధ్య జరుగుతున్న పరిణామాలను తాము నిశితంగా గమనిస్తున్నట్లు... చైనా కీలక ప్రకటన చేసింది.
ఈ మేరకు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ( Chinese Foreign Minister Wang Yi)... పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ ( Ishaq Dar) తో ఫోన్ లో మాట్లాడారు. ఇండియా అలాగే పాకిస్తాన్ దేశాలు కాస్త సంయమనం పాటించాలని ఈ సందర్భంగా చైనా విదేశాంగ మంత్రి చెప్పినట్లు సమాచారం అందుతోంది. దయాదుల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు, తాము కృషి చేస్తామని చెప్పినట్లు తెలుస్తోంది.
అటు పహల్గామ్ ( Pahalgam) దాడిని చైనా ఇప్పటికే... ఖండించిన సంగతి తెలిసిందే. ఆ సంఘటనను అమానవీయ చర్యగా పేర్కొంది చైనా. ఇది ఇలా ఉండగా... ఇండియాతో యుద్ధం నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్మీ గజ గజ వణికి పోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇండియాతో యుద్ధం అంటేనే భయపడి దాదాపు 1450 మంది సైనికులు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.






