- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
China: చైనా డిఫెన్స్ బడ్జెట్ భారీగా పెంపు.. గతేడాది కంటే 7.2 శాతం అధికం
2035 నాటికి తన సైన్యాన్ని అత్యంత శక్తివంతం చేయాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు అనుగుణంగా రక్షణ బడ్జెట్‌ను నిరంతరం పెంచుతోంది.

దిశ, నేషనల్ బ్యూరో: 2035 నాటికి తన సైన్యాన్ని అత్యంత శక్తివంతం చేయాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు అనుగుణంగా రక్షణ బడ్జెట్ (Defence budget)ను నిరంతరం పెంచుతోంది. ఈ క్రమంలోనే మరోసారి డిఫెన్స్ బడ్జెట్‌ను భారీగా పెంచింది. 2025 రక్షణ బడ్జెట్‌ను 249 బిలియన్లుగా వెల్లడించింది. బుధవారం నిర్వహించిన14వ నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ మూడో సమావేశంలో దీనిని ప్రకటించింది. ఇది గతేడాది బడ్జెట్ కంటే 7.2శాతం ఎక్కువ కావడం గమనార్హం. గతేడాది చైనా రక్షణ బడ్జెట్ 232 బిలియన్లుగా ఉంది. ఈ సంవత్సరానికి ఆర్థిక వృద్ధి లక్ష్యం సుమారు 5 శాతం ఉన్నప్పటికీ, చైనా సైనిక వ్యయం ఆర్థిక విస్తరణ కంటే వేగంగా పెరుగుతూనే ఉంది. చైనా తన సైన్యాన్ని పెద్ద ఎత్తున ఆధునీకరిస్తోంది. దీని కింద కొత్త విమాన వాహక నౌకలను నిర్మిస్తోంది. అంతేగాక క్షిపణులు, నౌకలు, జలాంతర్గాములు, నిఘా సాంకేతికతతో సహా అధునాతన సైనిక సామర్థ్యాల్లో చైనా భారీగా పెట్టుబడులు పెడుతోంది.
పొరుగు దేశాల ఆందోళన
చైనా భారీగా సైనిక ఆధునీకీకరణ చేస్తుండటంతో దాని పొరుగు దేశాలు ఆందోళనకు గురవుతున్నాయి. ముఖ్యంగా ద్వీప దేశం తైవాన్ (Taiwan) ఎక్కువగా ఆందోళన చెందుతోంది. చైనా తైవాన్‌ను తన భూభాగమేనని వాదిస్తోంది. ఎప్పటికైనా తమ దేశంలో విలీనం చేసుకుంటామని ఇప్పటికే పలు మార్లు ప్రకటించింది. అంతేగాక అమెరికా, జపాన్, భారత్, ఫిలిప్పీన్స్ వంటి పొరుగు దేశాలు సైతం ఆందోళన చెందుతున్నాయి. తూర్పు చైనా సముద్రంలో జపాన్‌తో చైనాకు తీవ్రమైన వివాదం ఉండటంతో ఆదేశం సైతం చైనాను ఆసక్తిగా గమనిస్తోంది.






