China: చైనా యుద్ధాల్లో పాల్గొనదు.. విదేశాంగ మంత్రి వాంగ్ యీ

by B.Srinivas |

వివాదాన్ని ముగించడానికి చైనాపై 50 నుంచి 100 శాతం సుంకాలు విధించాలని ట్రంప్ నాటోకు ప్రతిపాదించిన విషయం తెలిసిందే.

China: చైనా యుద్ధాల్లో పాల్గొనదు.. విదేశాంగ మంత్రి వాంగ్ యీ
X

దిశ, నేషనల్ బ్యూరో: రష్యా ఉక్రెయిన్ వివాదాన్ని ముగించడానికి చైనాపై 50 నుంచి 100 శాతం సుంకాలు విధించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) నాటోకు ప్రతిపాదించిన విషయం తెలిసిందే. దీనిపై బీజింగ్ స్పందించింది. సమస్యలను పరిష్కరించడానికి, శాంతి చర్చలను ప్రోత్సహించడానికి చైనా కట్టుబడి ఉందని ఆ దేశ విదేశాంగ మంత్రి వాంగ్ యీ (Wang yi) స్పష్టం చేశారు. స్లోవేనియా రాజధాని ల్జుబ్లాజానాలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. యుద్ధాలు సమస్యలను పరిష్కరించలేవని, ఆంక్షలు వాటిని మరింత క్లిష్టతరం చేస్తాయని నొక్కి చెప్పారు.

‘చైనా యుద్ధాల్లో పాల్గొనదు. వాటికి ప్రణాళికలు వేయదు. కానీ శాంతి చర్చలను ప్రోత్సహించి చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తుంది. భద్రతా సమస్యలపై ఉత్తమ రికార్డు కలిగిన బాధ్యతాయుతమైన దేశం చైనా’ అని తెలిపారు. అంతర్జాతీయంగా ప్రస్తుత పరిస్థితి గందరగోళం, సంఘర్షణలతో ముడిపడి ఉందని, కాబట్టి చైనా, యూరప్‌లు ప్రత్యర్థులుగా కాకుండా స్నేహితులుగా ఉండాలని తెలిపారు.

Next Story