China: తైవాన్ పై అమెరికా కీలక వ్యాఖ్యలు.. చైనా ఆగ్రహం

by Shamantha N |

: తైవాన్ స్వాతంత్య్రానికి సంబంధించి చైనా కీలక నిర్ణయం తీసుకుంది. ‘‘ తైవాన్‌ స్వాతంత్య్రానికి మేం మద్దతు ఇవ్వం’’ అని విదేశాంగ శాఖ వెబ్‌సైట్‌లో ఉన్న స్టేట్‌మెంట్‌ను అమెరికా తొలగించింది.

China: తైవాన్ పై అమెరికా కీలక వ్యాఖ్యలు.. చైనా ఆగ్రహం
X

దిశ, నేషనల్ బ్యూరో: తైవాన్ స్వాతంత్య్రానికి సంబంధించి చైనా కీలక నిర్ణయం తీసుకుంది. ‘‘ తైవాన్‌ స్వాతంత్య్రానికి మేం మద్దతు ఇవ్వం’’ అని విదేశాంగ శాఖ వెబ్‌సైట్‌లో ఉన్న స్టేట్‌మెంట్‌ను అమెరికా తొలగించింది. ఈ విషయం డ్రాగన్‌ ఆగ్రహానికి కారణమైంది. తైవాన్ కు సంబంధించిన వైఖరిపై అమెరికా తీసుకున్న నిర్ణయంపై బీజింగ్ మండిపడింది. అమెరికా వెబ్ సైట్ లోని సవరణ "తైవాన్ స్వాతంత్య్రం కోసం వాదించే వేర్పాటువాద శక్తులకు తప్పుడు సంకేతాన్ని పంపుతోంది. అగ్రరాజ్యం తన తప్పులను సరిదిద్దుకోవాలి " అని చైనా విదేశాంగ శాఖ తెలిపింది.

ఫ్యాక్ట్ షీట్ లో..

అమెరికా స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌లోని తైవాన్‌-అమెరికా సంబంధాల ఫ్యాక్ట్‌షీట్‌లో గతంలో ‘‘మేము తైవాన్‌ స్వాతంత్య్రాన్ని సమర్థించము’’ అని ఉండేది. అయితే, గతవారం ఈ వాక్యాన్ని తొలగించింది. రొటీన్‌ అప్‌డేట్‌గా దీన్ని అమెరికా అభివర్ణించింది. తాము వన్‌ చైనా పాలసీకి కట్టుబడి ఉన్నామని అమెరికా విదేశాంగశాఖ ప్రతినిధి వెల్లడించారు. తైవాన్‌తో అనధికారిక సంబంధం గురించి సాధారణ ప్రజలకు తెలియజేయడానికి ఫ్యాక్ట్ షీట్ నవీకరించామని అన్నారు. కాగా.. ఈనేపథ్యంలోనే చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు, తైవాన్ ను స్వతంత్ర దేశంగా కాకుండా చైనాలో భాగంగా గుర్తించి అమెరికా అధికారిక సంబంధాలను నెరుపుతోంది. కానీ చాలా మంది తైవాన్ ప్రజలు తమను తాము ప్రత్యేక దేశంలో భాగమని భావిస్తారు.

Next Story