- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సరిహద్దు సమస్యలపై భారత్-చైనా చర్చ.. త్వరలో మరోసారి భేటీ
సరిహద్దు సమస్యలపై భారత్-చైనా ప్రతినిధులు చర్చించారు. త్వరలోనే మరోసారి భేటీ అవ్వాలని నిర్ణయించారు.

దిశ, నేషనల్ బ్యూరో: సరిహద్దు విషయంలో భారత్‌తో దౌత్యచర్చలు చాలా స్పష్టంగా జరిగాయని చైనా తెలిపింది. వర్కింగ్ మెకానిజం ఫర్ కన్సల్టేషన్ అండ్ కోఆర్డినేషన్ (డబ్ల్యూఎంసీసీ) కింద ఇరుదేశాల మధ్య ఢిల్లీలో ఈ చర్చలు జరిగాయి. ‘చైనా, భారత్ బౌండరీ విషయంపై ప్రత్యేక ప్రతినిధుల మధ్య జరిగిన 23వ సమావేశంలో సుదీర్ఘ చర్చలు జరిపాం.
ఈ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను ఎలా అమలు చేయాలని కూడా ఆలోచించాం. 24వ సమావేశం కోసం కలిసి ప్రిపేర్ అవ్వాలని నిర్ణయించాం’ అని చైనా విదేశాంగ శాఖ తెలిపింది. సరిహద్దు ప్రాంతాల్లో శాంతి కొనసాగడంపై ఇరుదేశాలు సంతృప్తిగా ఉన్నాయని, దీని వల్ల రెండు దేశాల దౌత్య సంబంధాలు కూడా సాధారణ స్థాయికి చేరుకుంటున్నాయని భారత విదేశాంగ శాఖ పేర్కొంది.
ఈ ఏడాది మరోసారి ఇరుదేశాలు భారత్ వేదికగా కలిసి సరిహద్దు అంశంపై చర్చలు నిర్వహిస్తాయని, దీనిపై కూడా తాజా సమావేశంలో చర్చించామని అధికారులు తెలిపారు. అలాగే సరిహద్దు సమస్యలపై రెగ్యులర్‌గా చర్చలు నిర్వహించాలని, అభిప్రాయాలు పంచుకోవాలని ఇరుదేశాలు నిర్ణయించినట్లు పేర్కొన్నారు.






