- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
China : ఆ కథనాలన్నీ అవాస్తవం.. పాక్‌కు ఆయుధాల సరఫరాపై చైనా
భారత్ పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ పాక్ కు సైనిక విమానం ద్వారా ఆయుధాలు సరఫరా చేశారని వెలువడుతున్న కథనాలను చైనా తోసిపుచ్చింది.

దిశ, నేషనల్ బ్యూరో: భారత్ పాకిస్థాన్ (India pakisthan) మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ పాక్‌కు తమ సైనిక విమానం ద్వారా ఆయుధాలు సరఫరా చేశారని వెలువడుతున్న కథనాలను చైనా తోసిపుచ్చింది. ఈ ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, పుకార్లు వ్యాప్తి చేసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు చైనా రక్షణ మంత్రిత్వ శాఖ వెబ్ సైట్ వేదికగా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ (పీఎల్ఏఏఎఫ్) సోమవారం ఓ ప్రకటన రిలీజ్ చేసింది. పీఎల్ఏఏఎఫ్‌కు చెందిన వై-20 రవాణా విమానం ద్వారా పాక్‌కు ఎటువంటి ఆయుధ సామగ్రిని డెలివరీ చేయలేదని స్పష్టం చేసింది. పాక్‌కు సహాయ సామాగ్రిని తీసుకెళ్లడానికి Y-20ని ఉపయోగించారని వస్తున్న కథనాలన్నీ పుకార్లేనని తెలిపింది. నకిలీ కథనాలు ప్రచారం చేసే వారు బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొంది.
కాగా, ఆపరేషన్ సిందూర్ (Operation sindhoor) టైంలో చైనా తమ వై-20 సైనిక విమానం ద్వారా పాక్‌కు ఆయుధాలు సప్లై చేసిందని ఇటీవల పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఈ నేపథ్యంలోనే చైనా క్లారిటీ ఇచ్చింది. అయితే 2020, 2024 మధ్య పాకిస్తాన్‌కు అతిపెద్ద ఆయుధాల సరఫరాదారు చైనా అని, ఆ దేశ ఆయుధ దిగుమతుల్లో 81 శాతం చైనానే సరఫరా చేస్తుందని స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (SIPRI) నివేదికలో వెల్లడైంది. వాటిలో ఫైటర్ జెట్‌లు, రాడార్లు, జలాంతర్గాములు, క్షిపణి వ్యవస్థలు వంటి అధునాతన సైనిక పరికరాలు ఉన్నాయని పేర్కొంది.






