- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లిఫ్ట్ డోర్‌లో ఇరుక్కున్న చిన్నారి చెయ్యి.. తల్లడిల్లిన తల్లిదండ్రులు
పెద్దలకైతే నొప్పిని భరించే శక్తి ఉంటుంది, మనసును ఓదార్చుకునే పరిణతి ఉంటుంది.

దిశ, వెబ్‌డెస్క్: పెద్దలకైతే నొప్పిని భరించే శక్తి ఉంటుంది, మనసును ఓదార్చుకునే పరిణతి ఉంటుంది. కానీ, మాటలు కూడా రాని పసికందుకో, అప్పుడప్పుడే తప్పటడుగులు వేస్తున్న చిన్నారికి ఏ చిన్న దెబ్బ తగిలినా.. ఆ కన్నవారి గుండె తరుక్కుపోతుంది. అది కేవలం దెబ్బే కావచ్చు, కానీ తల్లిదండ్రులకు మాత్రం అది ప్రాణసంకటంగా మారుతుంది. సరిగ్గా ఇలాంటి ఘటనే మహారాష్ట్రలోని పూణేలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పుణెలోని దిఘిలో ఒక హౌసింగ్ సొసైటీ లిఫ్ట్ గేటులో ఓ చిన్నారి చేయి ఇరుక్కుపోయింది. అయితే అక్కడున్న వారు సరిగ్గా స్పందించి ఆ చిన్నారిని కాపాడారు. కానీ.. చిన్నారిని కాపాడేందుకు ఆ తల్లిదండ్రులు పడిన బాధ అందరినీ కన్నీరు పెట్టించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరలవుతోంది. ఈ ప్రమాదం నేపథ్యంలో పసిబిడ్డలు, చిన్న పిల్లలతో లిఫ్టులో వెళ్లేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, ఇటువంటి ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు స్థానికులను కోరుతున్నారు.






