- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గాలి వాన బీభత్సం.. ఒక్కసారిగా గాల్లోకి ఎగిరిపోయిన చిన్నారులు(వీడియో)
దేశవ్యాప్తంగా భారీ వర్షాలు(Heavy rains) కురుస్తాయని, పలు చోట్ల బలమైన ఈదురు గాలులు వీస్తాయని ఇటీవల భారత వాతావరణ శాఖ(IMD) హెచ్చరించిన విషయం తెలిసిందే.

దిశ,వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా భారీ వర్షాలు(Heavy rains) కురుస్తాయని, పలు చోట్ల బలమైన ఈదురు గాలులు వీస్తాయని ఇటీవల భారత వాతావరణ శాఖ(IMD) హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వర్షాలు, ఈదురు గాలులకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్‌లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.
మధ్యప్రదేశ్(Madya Pradesh)లోని సాగర్(Sagar)లో బలమైన గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో తుఫాను సమయంలో భీకర గాలుల ధాటికి ఓ ఇంటి పైకప్పు అమాంతంగా గాల్లోకి ఎగిరి పోయింది. అయితే పైకప్పు ఎగిరి పోవడంతో దానిని పట్టుకుని ఉన్న చిన్న పిల్లలు కూడా పైకి లేచి పడిపోయారు. కానీ గాలుల ఉద్ధృతికి పైకప్పు లేచిపోవడంతో వారు కూడా ఎగిరి పడ్డారు. అయితే పిల్లలు క్షేమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో ప్రజెంట్ సోషల్ మీడియా(Social Media)లో వైరల్ అవుతోంది. అయితే భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు సూచించారు.






