Supreme Court: తల్లిదండ్రులను పట్టించుకోని పిల్లలకు వారి ఆస్తులు అనుభవించే హక్కు లేదు: సుప్రీంకోర్టు

by Prasad Jukanti |   (  Updated:2025-09-25 10:40:24  IST  )

వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల సంరక్షణ, పోషణ విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది.

Supreme Court: తల్లిదండ్రులను పట్టించుకోని పిల్లలకు వారి ఆస్తులు అనుభవించే హక్కు లేదు: సుప్రీంకోర్టు
X

దిశ, డైనమిక్ బ్యూరో: వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల బాగోగుల విషయంలో సుప్రీంకోర్టు (Supreme Court) మరోసారి సంచలన తీర్పు వెలువరించింది. సీనియర్ సిటిజన్ల పట్ల తమ బాధ్యతలను నిర్వర్తించడంలో విఫలమైనప్పుడు పిల్లలకు ఆ వృద్దుల నుంచి సంక్రమించిన ఆస్తులను అనుభవించే హక్కు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కుమారుడు తమ సంరక్షణ (Parents Maintenance) బాధ్యతలు చూసుకోవడం లేదంటూ మహారాష్ట్రకు చెందిన 80 ఏళ్ల వృద్ధుడు కమలకాంత్ మిశ్రా, తన 78 ఏళ్ల భార్య దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్‍పై ఇవాళ జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.

బిడ్డల నిరాదరణకు గురయ్యే తల్లిందండ్రుల కోసం ప్రభుత్వం 2007లో తీసుకువచ్చిన 'మెయింటెనెన్స్ అండ్ వెల్‌ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజెన్స్ యాక్ట్' (Maintenance and Welfare of Parents and Senior Citizens Act 2007) అండగా నిలుస్తుందని ఈ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ చట్ట ప్రకారం తల్లిదండ్రుల సంరక్షణ చూసుకోని పక్షంలో పేరెంట్స్ తమ పిల్లలకు, బంధువులకు బదిలీ చేసిన ఆస్తిపై యాజమాన్య హక్కులు తిరిగి బాధితులకే దక్కేలా ఆదేశించే అధికారం ట్రైబ్యునళ్లకు ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. గతంలోనూ సుప్రీంకోర్టు ఇదే తరహాలో తీర్పులను ఇచ్చింది.

Next Story