- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Iraqi law on Child Marraige: మానవతా విలువలు లేని చట్టాలు.. చిన్నప్పుడే పెళ్ళి.. నరకకూపంలో బాలికల దీన స్థితి!
Iraqi law on Child Marraige: ఇకపై ఇరాక్‌లో బాలికల పెళ్లి వయసు 9. గతంలో 18ఏళ్లు నిండేవరకు పెళ్లి చేయకూడదనే చట్టం ఉండేది.

దిశ, వెబ్‌డెస్క్: Iraqi law on Child Marraige: ఇకపై ఇరాక్‌లో బాలికల పెళ్లి వయసు 9. గతంలో 18ఏళ్లు నిండేవరకు పెళ్లి చేయకూడదనే చట్టం ఉండేది. ఇప్పుడు ఆ చట్టాన్ని రద్దు చేశారు. ఇది పిల్లల హక్కులను కాలరాయడేమనన్న విమర్శలు వినిపిస్తున్నారు. ఇరాక్ పార్లమెంట్ ఇటీవల ఓ చట్టాన్ని ఆమోదించడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ చట్టం ప్రకారం, తొమ్మిదేళ్ల బాలికలకూ వివాహం చేసుకునే అనుమతి ఇస్తోంది. ఇది మహిళా హక్కులు, బాలల హక్కులకు చెడు జరుగుతున్నదని నిపుణులు, సామాజిక కార్యకర్తలు విమర్శిస్తున్నారు. ఈ నిర్ణయాన్ని బాలలపై లైంగిక దాడిగా అభివర్ణిస్తున్నారు.
అసలేంటి చట్టం?
1950ల నుంచి అమలులో ఉన్న 18 ఏళ్లు నిండక ముందే వివాహాలు చేయరాదనే చట్టాన్ని కొత్త చట్టం రద్దు చేసింది. ఇప్పుడు కుటుంబ వ్యవహారాలు, వివాహాలు, విడాకులు, పిల్లల సంరక్షణ వంటి విషయాలు పూర్తిగా మతాధికారుల నియంత్రణలోకి వెళ్లాయి. ప్రముఖ న్యాయవాది మహమ్మద్ జుమా ఈ చట్టంపై మాట్లాడుతూ, “ఇది మహిళా హక్కుల ముగింపు, బాలల హక్కుల తుదిమెట్టు” అని వ్యాఖ్యానించారు. ఇరాకీ జర్నలిస్ట్ సజా హషీం మాట్లాడుతూ, “మహిళల భవిష్యత్తు మతపెద్దల చేతుల్లోకి వెళ్లడం భయంకరమైన విషయం” అని ఆవేదన వ్యక్తం చేశారు.
భయంకర నిజాలు:
2023లో ఐక్యరాజ్యసమితి జరిపిన సర్వే ప్రకారం, ఇరాక్‌లో 18 ఏళ్లు నిండక ముందే వివాహం చేసుకున్న బాలికల శాతం 28%. చట్టం కఠినంగా ఉండాల్సిన సమయంలో, ఇది మరింత వెనుకబాటుకు దారితీస్తోంది. ఇక మతం ప్రకారం వివాహ వయసు షియాలకు, సున్నీలకు వేరువేరుగా ఉంది. షియా ముస్లిం బాలికల కనిష్ట వివాహ వయసు 9 ఏళ్లు. అటు సున్నీ ముస్లిం బాలికల కనిష్ట వివాహ వయసు 15 ఏళ్లు.
పేదరికం నుంచి బయటపడేందుకు వివాహం ఒక మార్గంగా చెప్పబడుతున్నా, చాలా సందర్భాల్లో ఈ వివాహాలు విఫలమవుతున్నాయి. ఫలితంగా బాలికలు చదువు పూర్తి చేసుకోలేక, సామాజికంగా అవమానాలకు గురై జీవితాంతం నష్టపోతున్నారు. ఈ చట్టం ద్వారా మహిళలు, బాలికలు తీవ్రంగా నష్టపోతారని సామాజిక కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు. మహిళా హక్కుల ఉద్యమకారిణి బెనిన్ ఎలియాస్ మాట్లాడుతూ, “ఇది ఆశ్చర్యకరం కాదు. కానీ ఇది బాధపడే సమయం కాదు. మన హక్కుల కోసం పోరాడాల్సిన సమయం ఇది,” అని పిలుపునిచ్చారు.
ఇలాంటి చట్టాలు మానవ హక్కులను, సామాజిక న్యాయాన్ని పూర్తిగా చెరిపేస్తాయి. బాల్య వివాహాల ద్వారా బాలికల జీవితాలు అంధకారంలోకి తోసివేస్తాయి. ఇది కేవలం ఇరాక్ దేశానికే కాకుండా, ప్రపంచం మొత్తానికి మానవతా విలువలను అపహాస్యం చేసే చర్యగా అభివర్ణించవచ్చు.






