- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Tejashwi: మరోసారి తండ్రయిన తేజస్వి యాదవ్.. శుభాకాంక్షలు చెప్పిన దీదీ
ఆర్జేడీ నేత, బిహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్(Tejashwi Yadav) మరోసారి తండ్రయ్యారు. ఆయన సతీమణి రాజశ్రీ యాదవ్ కోల్‌కతాలోని ఓ ఆస్పత్రిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు.

దిశ, నేషనల్ బ్యూరో: ఆర్జేడీ నేత, బిహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్(Tejashwi Yadav) మరోసారి తండ్రయ్యారు. ఆయన సతీమణి రాజశ్రీ యాదవ్ కోల్‌కతాలోని ఓ ఆస్పత్రిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని మంగళవారం ఉదయాన్నే ‘ఎక్స్’ వేదికగా ప్రకటించిన తేజస్వీ యాదవ్.. బేబీతో ఉన్న ఫొటోను షేర్ చేసుకున్నారు. ‘గుడ్ మార్నింగ్.. మా నిరీక్షణ చివరకు ముగిసింది. కుమారుడి రాకను ప్రకటిస్తున్నందుకు ఆనందంగా ఉంది. జై హనుమాన్’ అంటూ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. కాగా.. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్ గా మారుతోంది. దీంతో, పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు, నెటిజన్లు తేజస్వి దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
లాలూ ఫ్యామిలీతో దీదీ..
కాగా.. పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆస్పత్రికి వెళ్లి లాలూ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు చెప్పారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆమె ‘ఎక్స్’లో షేర్ చేశారు. ‘‘తేజస్వీ యాదవ్ సతీమణి రాజశ్రీ యాదవ్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. వారి సంబురాల్లో నేను భాగమయినందుకు నాకు ఆనందంగా ఉంది. ఆ దంపతులతో పాటు లాలూ జీ కుటుంబానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆశీస్సులు. ఈ రోజు వారిని కలవడం ఆనందంగా ఉంది. తల్లిబిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నందుకు సంతోషంగా ఉంది. రాజశ్రీ కోల్‌కతాలో ఉన్న విషయం నాకు తెలుసు. అంతేకాకుండా తేజస్వీ కూడా తనకు బిడ్డ పుట్టిన విషయాన్ని నిన్న సాయంత్రం తెలిపారు. వస్తానని మాట ఇచ్చి.. ఈరోజు నేను ఆస్పత్రికి వెళ్లాను. ఈ చిన్నారి గొప్పగా ఎదిగి ఆ కుటుంబానికి అదృష్టంగా, ఆశాకిరణంగా మారాలని ఆకాంక్షిస్తున్నా’’ అని దీదీ తన పోస్టులో పేర్కొన్నారు.






