- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చైనా కాదు ఇండియాలో గబ్బిలాల మాంసంతో వంటకాలు..బయటపడిన షాకింగ్ నిజాలు
ప్రస్తుతం చాలా మంది బయట ఫుడ్‌కు అలవాటు పడ్డారు. ఇంట్లో చేసుకునే తీరిక లేక ఉద్యోగాలతో బిజీగా ఉండటం ఇలా రకరకాల కారణాలతో ఎక్కువగా బయట ఫుడ్ తింటున్నారు.

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం చాలా మంది బయట ఫుడ్‌కు అలవాటు పడ్డారు. ఇంట్లో చేసుకునే తీరిక లేక ఉద్యోగాలతో బిజీగా ఉండటం ఇలా రకరకాల కారణాలతో ఎక్కువగా బయట ఫుడ్ తింటున్నారు. ఆన్ లైన్‌లో అర్డర్ చేస్తే పదినిమిషాల్లోనే ఫుడ్ ముందు ఉండటంతో మరింత రెచ్చిపోతున్నారు. అయితే అలాంటివాళ్లు బయట ఫుడ్ తినేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నాణ్యత లేని ఆహారం తయారు చేయడంతో పాటు ఏకంగా ఒక మాంసంకు బదులు మరో మాంసాన్ని వాడుతున్నారు.
తాజాగా తమిళనాడులో చికెన్ పకోడీలో గబ్బిలాల మాసం వాడటం కలకలం రేపుతోంది. సేలం జిల్లా ఓమలూరులో గబ్బిలాల మాంసం సరఫరా చేస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అటవీ ప్రాంతంలో నాటు తుపాకులతో గబ్బిలాలను వేటాడి వాటి మాంసాన్ని విక్రయిస్తున్నట్టు గుర్తించారు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు మాంసాన్ని విక్రయిస్తుండగా, వాటి మాంసంతో చికెన్ పకోడి, చిల్లీచికెన్ లాంటి వంటకాలను తయారు చేసి అమ్ముతున్నట్టు నిర్దారించారు. ఇదిలా ఉంటే గబ్బిలాల వల్లనే కరోనా వచ్చిందని నివేధికలు చెబుతున్న సంగతి తెలిసిందే. దీంతో అక్కడ గబ్బిలాల వంటకాలనే బ్యాన్ చేశారు. ఇప్పుడు ఇండియాలో వాటితో వంటకాలు చేయడం ఆందోళన కలిగిస్తోంది.






