ప్రధాని మోడీ ఇలాకాలో కేసీఆర్ ప్లెక్సీలు

by Web Desk |
ప్రధాని మోడీ ఇలాకాలో కేసీఆర్ ప్లెక్సీలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ ఇలాకా అయిన వారణాసిలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్లెక్సీలు కలకలం రేపాయి. మొన్న మహారాష్ట్ర, నిన్న ఏపీ, నేడు యూపీలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇమేజ్‌ పెరుగుతుందనడానికి నిదర్శనం అని టీఆర్ఎస్ శ్రేణులు చర్చించుకుంటున్నారు. రాజకీయ నిపుణులకు, తలపండిన మేధావులకు సైతం సీఎం కేసీఆర్ అర్ధం కాని రీతిలో వ్యూహాలు చేస్తున్నారు. కేసీఆర్ ఎత్తులతో అధిష్టానం తలపట్టుకుంది. కేసీఆర్‌ను ఎదుర్కోలేక తెలంగాణ మీద కక్ష సాధింపు చర్యలు, నిధుల కేటాయింపులో కేంద్రం వివక్ష చూపుతుందని టీఆర్ఎస్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సైతం సమావేశాలలో పేర్కొంటున్నారు. కేంద్రం తీరును ఎండకడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఒకపక్క ఇతర రాష్ట్రాల్లో కేసీఆర్ ప్లె్క్సీలు వెలుస్తుండడం, మరోపక్క కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి సారించడం హాట్ టాపిక్‌గా మారింది.







Next Story

Most Viewed