- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిండు సభలో అందరూ చూస్తుండగానే పోలీస్ అధికారిపై చెయ్యెత్తిన CM.. వేదిక మీదకు దూసుకొచ్చిన మహిళా నేతలు
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(CM Siddaramaiah) మరోసారి వివాదంలో చిక్కుకున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(CM Siddaramaiah) మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. నిండు సభలో అందరూ చూస్తుండగానే పోలీసు అధికారి(Police Officer)పై చెయ్యెత్తారు. ఇవాళ కర్ణాటకలోని బెళగావిలో సీఎం సిద్ధరామయ్య పర్యటించారు. బీజేపీ మహిళా మోర్చా నాయకులు(BJP Mahila Morcha Leaders) సీఎం కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అనంతరం వేదికమీద సీఎం మాట్లాడుతున్న సమయంలోనూ ‘‘సీఎం డౌన్ డౌన్’’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అంతేకాదు. వేదికమీదకు దూసుకొచ్చేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో సెక్యూరిటీ లోపంపై పోలీస్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వేదికమీదకు ఓ పోలీస్ అధికారిని పిలిచి.. కొట్టేందుకు చెయ్యెత్తారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో సీఎం సిద్ధరామయ్యపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
కాగా, ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పెహల్గాం ఉగ్రదాడి(Terror Attack) ఘటనపై మాట్లాడారు. పాకిస్తాన్‌తో యుద్ధం చేయాల్సిన అవసరం లేదని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల వీడియోలు సోషల్ మీడియాలో ప్రసారం అవుతుండటంతో.. బీజేపీ(BJP) శ్రేణులు ఆయన్ను తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఇప్పటికే ఇప్పటికే సిద్ధరామయ్య సైతం స్పందించి.. యుద్ధం వద్దని తాను చెప్పలేదని.. అనివార్యమైతేనే జరగాలని, ఎందుకంటే అది పరిష్కార మార్గం కాదన్నారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలకు పాల్పడకుండా పాకిస్థాన్‌కు గుణపాఠం నేర్పాలని వివరణ ఇచ్చారు. సోషల్ మీడియాలో ట్వీట్ కూడా చేశారు.






