Chhattisgarh: ఛత్తీస్ గఢ్ లో దారుణం.. కన్న తల్లిని చంపిన కుమారుడు

by Shamantha N |

కన్న కొడుకే కాలయముడయ్యాడు. సొంత కొడుకే కేవలం రూ. 200 కోసం కన్న తల్లినే కడతేర్చాడు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో శుక్రవారం జరిగింది.

Chhattisgarh: ఛత్తీస్ గఢ్ లో దారుణం.. కన్న తల్లిని చంపిన కుమారుడు
X

దిశ, నేషనల్ బ్యూరో: కన్న కొడుకే కాలయముడయ్యాడు. సొంత కొడుకే కేవలం రూ. 200 కోసం కన్న తల్లినే కడతేర్చాడు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో శుక్రవారం జరిగింది. శుక్రవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ఉర్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగేశ్వర్ నగర్‌లో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు ప్రదీప్ దేవాంగన్ (45) రిక్షా డ్రైవర్. అతనికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉంది. దేవాంగన్ రూ.800 పెట్టి ఓ కుక్కపిల్ల కొనాలనుకున్నాడాని.. దానికి రూ.200 తక్కువయ్యాయి. డబ్బులు ఇవ్వాలని తన తల్లి గణేషి(70)ని అడిగాడు. బాధితురాలు డబ్బు ఇవ్వడానికి నిరాకరించడంతో దేవాంగన్ ఆమెను సుత్తితో బలంగా కొట్టాడు. అడ్డు వచ్చిన తన భార్య రామేశ్వరిపై కూడా దాడి చేశాడు. దేవాంగన్ 15 ఏళ్ల కుమారుడు ఈ ఘటనను చూసి భయాందోళనకు గురయ్యాడు. వెంటనే పొరుగువారికి దాడి గురించి తెలియజేశాడు. స్థానికులు అక్కడికి చేరుకోగానే నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు స్పాట్ కి చేరుకుని ఇద్దరు మహిళలను ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గణేషి మరణించింది. నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, అతనిపై హత్య కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు.

Next Story