ఛత్తీస్‌గఢ్ లిక్కర్‌ స్కామ్‌ కేసు.. మాజీ సీఎం కుమారుడి ఆస్తులు అటాచ్‌ చేసిన ఈడీ

by Malleboina Mahesh |

ఛత్తీస్‌గఢ్ లిక్కర్‌ స్కామ్‌ కేసు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ కుమారుడు చైతన్య బఘేల్‌కు చెందిన రూ.61.20 కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ (ఈడీ) తాత్కాలికంగా అటాచ్‌ చేసింది.

ఛత్తీస్‌గఢ్ లిక్కర్‌ స్కామ్‌ కేసు.. మాజీ సీఎం కుమారుడి ఆస్తులు అటాచ్‌ చేసిన ఈడీ
X

దిశ, వెబ్ డెస్క్: ఛత్తీస్‌గఢ్ లిక్కర్‌ స్కామ్‌ కేసు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ కుమారుడు చైతన్య బఘేల్‌కు చెందిన రూ.61.20 కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ (ఈడీ) తాత్కాలికంగా అటాచ్‌ చేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం (PMLA)–2002 ప్రకారం ఈ చర్య తీసుకున్నట్టు ఈడీ ఈ రోజు వెల్లడించింది. ఈ ఆస్తులు ఛత్తీస్‌గఢ్ లిక్కర్ స్కామ్‌పై జరుగుతున్న దర్యాప్తుతో సంబంధమున్నవని అధికారులు గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ రోజు విడుదల చేసిన ఈడీ ప్రకటన ప్రకారం.. అటాచ్‌ చేసిన ఆస్తుల్లో రూ.59.96 కోట్ల విలువైన 364 నివాస ప్లాట్లు, వ్యవసాయ భూములు వంటి స్థిరాస్తులు ఉన్నాయి. అదనంగా రూ.1.24 కోట్ల విలువైన బ్యాంక్‌ ఖాతాలు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు వంటి చరాస్తులను కూడా సీజ్‌ చేసినట్లు పేర్కొన్నారు. లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఇప్పటివరకు పలు కీలక నేతలు, అధికారులు, వ్యాపారవేత్తలపై ఈడీ దర్యాప్తు కొనసాగిస్తోంది. కాగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో 2019 నుంచి 2022 మధ్యకాలంలో మద్యం విక్రయాల వ్యవస్థలో భారీ స్థాయిలో అవకతవకలు జరిగినట్లు Enforcement Directorate (ED) దర్యాప్తులో బయటపడింది.

ప్రభుత్వ రికార్డుల్లో నమోదు కాకుండా పెద్ద మొత్తంలో మద్యం విక్రయాలు జరిగి, ఆ డబ్బును రాజకీయ నాయకులు, అధికారులు, వ్యాపారవేత్తలు కలిసి వేరే మార్గాల ద్వారా దాచినట్లు ED వెల్లడించింది. దర్యాప్తులో భాగంగా మద్యం బాటిళ్లపై నకిలీ హోలోగ్రామ్‌లు ఉపయోగించడం, అక్రమంగా మద్యం నిల్వలు నిర్వహించడం, అధికారికంగా లేని షాపుల ద్వారా విక్రయాలు జరగడం వంటి అంశాలు బయటపడ్డాయి. ఈ అవినీతి రాకెట్ ద్వారా రాష్ట్రానికి దాదాపు రూ.2,000 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు ED అంచనా వేసిన విషయం తెలిసిందే.

Next Story