- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భార్య అలా చేయడం క్రూరత్వమే.. హైకోర్టు సంచలన తీర్పు
భార్య ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడం, మతం మారాలని ఒత్తిడి చేయడం క్రూరత్వమేనని ఛత్తీస్‌గఢ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి ప్రవర్తన విడాకులకు బలమైన కారణంగా నిలుస్తుందని స్పష్టం చేసింది.

దిశ, వెబ్ డెస్క్: భార్య ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడం, మతం మారాలని ఒత్తిడి చేయడం క్రూరత్వమేనని ఛత్తీస్‌గఢ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి ప్రవర్తన విడాకులకు బలమైన కారణంగా నిలుస్తుందని స్పష్టం చేసింది. ఛత్తీస్‌గఢ్‌లోని బలోద్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి ఫ్యామిలీ కోర్టు మంజూరు చేసిన విడాకులను సమర్థిస్తూ ఉన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. దంపతులకు 2018లో వివాహం అవ్వగా పెళ్లైన కొంత కాలానికే భార్య వేదింపులు మొదలుపెట్టింది.
కత్తితో పొడుచుకోవడం, పాయిజన్ తాగటం, కిరోసిన్ పోసుకుని నిప్పటించుకోవడం లాంటి ప్రయత్నాలు చేసిందని, తాను చస్తూ బతకాల్సి వస్తుందని భర్త 2019లో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఫ్యామిలీ కోర్టు విడాకులను మంజూరు చేయగా హైకోర్టు సైతం సమర్దించింది. క్రూరత్వం అంటే కేవలం శారీరక హింస మాత్రమే కాదని, భాగస్వామి మనసులో భయాన్ని కలిగించే ప్రవర్తన కూడా దాని కిందకే వస్తుందని కోర్టు అభిప్రాయపడింది. ఆత్మహత్య బెదిరింపుల కారణంగానే భార్యను పుట్టింట్లో వదిలిపెట్టినట్టు భర్త విచారణలో అంగీకరించిన విషయాన్ని ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది.






