అమరులైన సైనికుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా రూ.50 లక్షలకు పెంచిన ప్రభుత్వం

by Malleboina Mahesh |

దేశం కోసం ప్రాణాలు అర్పించి.. అమరవీరులైన సైనికుల కుటుంబాలకు అందించే ఎక్స్ గ్రేషియాపై ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కీలక నిర్నయం తీసుకుంది.

అమరులైన సైనికుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా రూ.50 లక్షలకు పెంచిన ప్రభుత్వం
X

దిశ, వెబ్ డెస్క్: దేశం కోసం ప్రాణాలు అర్పించి.. అమరవీరులైన సైనికుల కుటుంబాలకు అందించే ఎక్స్ గ్రేషియా (ex-gratia)పై ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కీలక నిర్నయం తీసుకుంది. యుద్ధంలో, సైనిక కార్యకలాపాలలో ప్రాణాలను త్యాగం చేసే రాష్ట్రానికి చెందిన సైనికుల కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని (Financial assistance) రూ.20 లక్షల నుండి రూ.50 లక్షలకు పెంచాలని ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సోమవారం నవ రాయ్‌పూర్‌లోని మంత్రాలయ మహానది భవన్‌లో ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి అధ్యక్షతన జరిగిన రాజ్య సైనిక్ బోర్డు (RSB) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ ప్రకటన తెలిపింది. యుద్ధ వితంతువులు, మాజీ సైనికులు, వారిపై ఆధారపడిన వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సంక్షేమ పథకాలపై కూడా ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. ఏది ఎమైనప్పటికి దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికులకు అండగా ఉండేందుకు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం (Government of Chhattisgarh) తీసుకున్న ఈ నిర్ణయంపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయి.

Next Story