Chathisgarh: ఛత్తీస్‌గఢ్‌లో ఎదురు కాల్పులు.. కోబ్రా కమాండో, ఓ మావోయిస్టు మృతి

by B.Srinivas |

ఛత్తీస్ గఢ్‌లో మరోసారి భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.

Chathisgarh: ఛత్తీస్‌గఢ్‌లో ఎదురు కాల్పులు.. కోబ్రా కమాండో, ఓ మావోయిస్టు మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: ఛత్తీస్‌గఢ్‌లో (Chathisgarh) మరోసారి భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. బీజాపూర్ జిల్లాలో గురువారం జరిగిన ఈ ఘటనలో సెంట్రల్ రిజర్వుడ్ పోలీస్ ఫోర్స్ (Crpf)కు చెందిన ఓ కోబ్రా కమాండర్, ఒక నక్సలైట్ మరణించినట్టు అధికారులు తెలిపారు. ఊసూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తుమ్రెల్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సుక్మా, బీజాపూర్ జిల్లాల సరిహద్దులో సీపీఐ మావోయిస్టుకు చెందిన నక్సలైట్లు ఆ ప్రాంతంలో ఉన్నారన్న సమాచారం మేరకు ఆపరేషన్ చేపట్టగా కాల్పులు జరిగాయి. మరణించిన కోబ్రా కమాండర్‌ను గుజరాత్‌కు చెందిన మెహుల్ సోలంకి (Mehul solanki) గా గుర్తించారు. మావోయిస్టుకు సంబంధించిన వివరాలు వెల్లడించలేదు. కాగా, అంతకుముందు నారాయణ పూర్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్‌లో 27 మంది మావోయిస్టులు మరణించిన విషయం తెలిసిందే.

Next Story