- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Chhattisgarh: కాంగ్రెస్ పార్టీకి మరో షాక్.. ఆ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్
ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు కైవసం చేసుకున్న బీజేపీ మున్సిపల్ ఎన్నికల్లోనూ సత్తా చాటింది.

దిశ, నేషనల్ బ్యూరో: ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh)లో కాంగ్రెస్ పార్టీ (Congress party)కి భారీ షాక్ తగిలింది. రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు కైవసం చేసుకున్న బీజేపీ మున్సిపల్ ఎన్నికల్లోనూ సత్తా చాటింది. ఛత్తీస్‌గఢ్‌లోని 10 మున్సిపల్ కార్పొరేషన్లు, 49 మున్సిపల్ కౌన్సిల్‌లు, 114 నగర పంచాయతీలకు ఇటీవల పోలింగ్ జరగగా శనివారం ఫలితాలు వెలువడ్డాయి. దీనిలో 10 మున్సిపల్ కార్పొరేషన్లను బీజేపీ కైవసం చేసుకుంది. ఇందులో కాంగ్రెస్ ఒక్క మేయర్ సీటునూ గెలుచుకోలేదు. అలాగే 49 మున్సిపల్ కౌన్సిల్‌లకుగాను బీజేపీ 35, కాంగ్రెస్ 8 స్థానాలను గెలుచుకుంది. ఒక మున్సిపల్ కౌన్సిల్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ (Aap) చైర్‌పర్సన్ పదవిని సొంతం చేసుకుంది. అంతేగాక నగర పంచాయతీల్లోనూ బీజేపీ సత్తా చాటింది. 81 నగర పంచాయతీ సీట్లలో గెలుపొందింది. ఇందులో కాంగ్రెస్ 22 మాత్రమే గెలుచుకుంది.
చారిత్రాత్మక విజయం: సీఎం విష్ణుదేవ్ సాయి
మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంపై సీఎం విష్ణుదేవ్ సాయి (Vishnu Deo Sai) స్పందించారు. దీనిని చారిత్రాత్మక విజయంగా అభివర్ణించారు. ఛత్తీస్‌గఢ్ రాజకీయ చరిత్రలో ఇది సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందని కొనియాడారు. రాష్ట్ర ప్రజలు మోడీకి గ్యారంటీ (Modi ki guarantee), రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి పనులపై విశ్వాసం చూపించారని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని తెలిపారు. గతంలో మేయర్ పదవికి పరోక్ష ఎన్నికలు నిర్వహించడం ద్వారా కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని హత్య చేసిందని ఆరోపించారు.






