దేశవ్యాప్తంగా ప్రారంభం అయిన ఛట్ పూజ.. నదులు, చెరువుల వద్ద కోలాహలం

by Malleboina Mahesh |

దేశవ్యాప్తంగా ఛట్ పూజ కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి. ఈ రోజు నుంచి నాలుగు రోజుల పాటు అంటే ఈ నెల 28 వరకు ఈ ఛట్ పూజలు జరగనున్నాయి.

దేశవ్యాప్తంగా ప్రారంభం అయిన ఛట్ పూజ.. నదులు, చెరువుల వద్ద కోలాహలం
X

దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా ఛట్ పూజ (Chhath Puja) కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి. ఈ రోజు నుంచి నాలుగు రోజుల పాటు అంటే ఈ నెల 28 వరకు ఈ ఛట్ పూజలు జరగనున్నాయి. ఈ పూజలో భాగంగా తెల్లవారుజామున, సాయంత్రం సూర్య దేవుని ఆరాధనకు భక్తులు పెద్ద ఎత్తున నదులు, చెరువులు, జలాశయాల వద్దకు చేరుకొని.. అత్యంత భక్తి శ్రద్ధలతో ఛట్ పూజలు జరుపుకుంటారు. ఈ ఛట్ పూజ కోసం ఢిల్లీ సీఎం రేఖ గుప్తా సోమవారం సెలవు ప్రకటించించారు. సూర్య దేవుడిని అత్యంత భక్తి శ్రద్దలతో ఆరాధించే ఈ పండుగను బీహార్, జార్ఖండ్, ఉత్తర ప్రదేశ్, పశ్చిమబెంగాల్, నేపాల్‌తో సహా ఉత్తర, తూర్పు భారతదేశంలో ఎక్కువగా జరుపుకుంటారు. దీంతో పనుల కోసం వివిధ ప్రాంతాలు, రాష్ట్రాలకు వలస వెళ్లిన ప్రజలు ఈ ఛట్ పూజ కోసం తమ సొంత ఊర్లకు తిరిగి వెళ్తుంటారు. దీనిని దృష్టిలో పెట్టుకున్న రైల్వే శాఖ ఛట్ పూజ కోసం దేశవ్యాప్తంగా 12 వందల ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. అలాగే తిరుగు ప్రయాణం కోసం కూడా రైల్వే శాఖ పెద్ద మొత్తంలో ఏర్పాట్లు చేస్తుంది.

Next Story