- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాకిస్థాన్ చినాబ్ నదిలో రికార్డు స్థాయిలో తగ్గిన నీటిమట్టం
పహల్గామ్ దాడి నేపథ్యంలో భారత్ పాకిస్థాన్‌తో నీటి ఒప్పందాన్ని రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో సలాల్ మరియు బాగ్లిహార్ ఆనకట్టల స్లూయిస్ గేట్లను మూసివేసింది.

దిశ, వెబ్ డెస్క్: పహల్గామ్ దాడి నేపథ్యంలో భారత్ పాకిస్థాన్‌తో నీటి ఒప్పందాన్ని రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో సలాల్ మరియు బాగ్లిహార్ ఆనకట్టల స్లూయిస్ గేట్లను మూసివేసింది. దీంతో పాకిస్థాన్ చీనాబ్ నదిలో నీటి మట్టం రికార్డు స్థాయికి పడిపోయింది. నీటి మట్టం పడిపోవడంతో నదీ పరివాహక ప్రాంతాల్లో వ్యవసాయంపై తీవ్రమైన ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది. నిజానికి సలాల్, బాగ్లిహార్ ఆనకట్టల గేట్లను ప్రతి సంవత్సరం మూసివేస్తారు. ఆనకట్టుల్లో పూడికలను తీయడానికి తిరిగి వాటిని నింపడానికి నీటిని ఆపి ఫ్లష్ చేస్తారు.
సాధారణంగా అయితే ఆగస్టులో రుతుపవనాల సమయంలో గేట్లను క్లోజ్ చేస్తారు. కానీ నీటి ఒప్పందాన్ని రద్దు చేసుకోవడంతో భారత్ రెండు డ్యామ్ ల గేట్లను మూసివేసింది. పాకిస్థాన్ యొక్క ఇండస్ రివర్ సిస్టమ్ అథారిటీ (IRSA) ఇచ్చిన డేటా ప్రకారం నీటి ప్రవాహంలో గణనీయమైన తగ్గుదలను చూపించింది. ఏప్రిల్ 23న 29,675 క్యూసెక్కుల నుండి మే 5 నాటికి 11,423 క్యూసెక్కులకు నీటిమట్టం పడిపోయింది. దీంతో దాదాపు 61 శాతం తగ్గుదల కనిపిస్తోంది. పాకిస్థాన్ మరియు పంజాబ్ లోని విస్తారమైన వ్యవసాయ భూములకు చినాబ్ కాలువుల ద్వారా సాగునీరు అందుతుంది. కాబట్టి నదీ ప్రవాహం తగ్గితే ఖరీఫ్ పంటలపై ఆ ఎఫెక్ట్ పడుతుందని పాకిస్థాన్ ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది.






