- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బోర్డు పరీక్షల్లో ఏఐ చాట్‌జీపీటీతో చీటింగ్.. 81 మంది టీచర్లు, సిబ్బందిపై వేటు!
మహారాష్ట్రలో జరుగుతున్న 10, 12వ తరగతి బోర్డు పరీక్షల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్ 'చాట్‌జీపీటీ'ని ఉపయోగించి విద్యార్థులకు కాపీయింగ్‌లో సహకరించిన 81 మంది ఉపాధ్యాయులు, పరీక్షా సిబ్బందిపై బోర్డు కఠిన చర్యలు తీసుకుంది.

దిశ, డైనమిక్ బ్యూరో: టెక్నాలజీని అడ్డంపెట్టుకోని కొందరు అక్రమాలకు వాడుకుంటున్నారు. మహారాష్ట్రలో జరుగుతున్న 10, 12వ తరగతి బోర్డు పరీక్షల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చాట్‌బాట్ 'చాట్‌జీపీటీ'ని ఉపయోగించి విద్యార్థులకు కాపీయింగ్‌లో సహకరించిన 81 మంది ఉపాధ్యాయులు, పరీక్షా సిబ్బందిపై బోర్డు కఠిన చర్యలు తీసుకుంది. వీరిని విధుల్లో నుంచి సస్పెండ్ చేస్తూ మహారాష్ట్ర రాష్ట్ర సెకండరీ, హయ్యర్ సెకండరీ విద్యా బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది.
బీడ్ జిల్లాలో అత్యధిక ప్రభావం..
రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో అవకతవకలు జరిగినట్లు వార్తలు వచ్చినప్పటికీ, బీడ్ జిల్లాలో ఈ పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ముఖ్యంగా అక్కడి చౌస్లా పరీక్షా కేంద్రంలో భారీ ఎత్తున మాస్ కాపీయింగ్ జరిగినట్లు తేలింది. విద్యార్థులకు సమాధానాలు అందించడానికి పరీక్షా సిబ్బందే స్వయంగా చాట్‌జీపీటీని వాడినట్లు విద్యా శాఖ గుర్తించింది.
నిఘా నీడలో పరీక్షలు..
ప్రస్తుతం మహారాష్ట్రలో బోర్డు పరీక్షలు జరుగుతున్నాయి. 12వ తరగతి (HSC) పరీక్షలు.. ఫిబ్రవరి 10, 2026న ప్రారంభమై, మార్చి 11 వరకు కొనసాగనున్నాయి. 10వ తరగతి (SSC) పరీక్షలు.. ఫిబ్రవరి 20, 2026న మొదలై, మార్చి 18 వరకు జరగనున్నాయి. ఈ కీలక సమయంలో జరిగిన ఈ ఉల్లంఘనపై అధికారులు తీవ్రంగా స్పందించారు. ‘ఇది సాంకేతికతను దుర్వినియోగం చేయడమే కాకుండా, పరీక్షల సమగ్రతను దెబ్బతీయడమే. ఇలాంటి చర్యలను ఉపేక్షించబోం’ అని బోర్డు అధికారులు స్పష్టం చేశారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు అక్కడి ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు పరీక్షా కేంద్రాల వద్ద భద్రతను మరింత కఠినతరం చేయాలని నిర్ణయించింది.






