Chatgpt: చాట్‌జీపీటీ సేవలకు అంతరాయం.. ధ్రువీకరించిన ఓపెన్ ఏఐ

by B.Srinivas |

ఓపెన్ ఏఐ తీసుకొచ్చిన ఏఐ చాట్‌బాట్ చాట్‌జీపీటీ సేవలకు ప్రపంచవ్యాప్తంగా అంతరాయం కలిగింది.

Chatgpt: చాట్‌జీపీటీ సేవలకు అంతరాయం.. ధ్రువీకరించిన ఓపెన్ ఏఐ
X

దిశ, నేషనల్ బ్యూరో: ఓపెన్ ఏఐ (Open Ai) తీసుకొచ్చిన ఏఐ చాట్‌బాట్ చాట్‌జీపీటీ (Chatgpt) సేవలకు ప్రపంచవ్యాప్తంగా అంతరాయం కలిగింది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో అకస్మాత్తుగా పని చేయడం ఆగిపోయింది. దీంతో భారత్, అమెరికా సహా ప్రపంచ వ్యాప్తంగా చాట్‌జీపీటీ వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనికి సంబంధించి దాదాపు 800 ఫిర్యాదు వచ్చినట్టు రియల్-టైమ్ మానిటరింగ్ ప్లాట్‌ఫామ్ డౌన్‌డెటెక్టర్ తెలిపింది. దాదాపు 88 శాతం ఫిర్యాదుల్లో చాట్‌బాట్ తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం లేదని పేర్కొన్నారు.

అలాగే 8 శాతం మంది మొబైల్ యాప్ సమస్యలను లేవనెత్తారు. మరో 3 శాతం మంది ఏపీఐ సంబంధిత ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారు. ఈ క్రమంలోనే ఓపెన్ ఏఐ దాని సిస్టమ్ స్టేటస్ పేజీలో అంతరాయాన్ని గుర్తించినట్టు తెలిపింది. చాట్ జీపీటీ, టెక్స్ట్-టు-వీడియో ప్లాట్‌ఫామ్ సోరా రెండూ ప్రభావితమయ్యాయని ధృవీకరించింది. ఈ సమస్యపై పరిశోధిస్తున్నామని తెలిపింది. అయితే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయిందా లేదా అనే విషయాన్ని వెల్లడించలేదు. ఈ సమస్యను పరిష్కరించడానికి ఎంత సమయం పట్టొచ్చనే విషయంపైనా క్లారిటీ ఇవ్వలేదు.

Next Story