మినిమమ్‌ బ్యాలెన్స్‌ పేరుతో రూ. 19 వేల కోట్లు వసూళ్లు

by Prasad Jukanti |

గడిచిన మూడేళ్లలో మినిమం బ్యాలెన్స్ చార్జీల రూపంలో బ్యాంకులు రూ. 19 వేల కోట్లు వసూలు చేశాయి.

మినిమమ్‌ బ్యాలెన్స్‌ పేరుతో రూ. 19 వేల కోట్లు వసూళ్లు
X

దిశ, డైనమిక్ బ్యూరో: రకరకాల సేవల పేరుతో వినియోగదారుల నుంచి బ్యాంకులు వసూలు చేస్తున్న చార్జీలు మరోసారి చర్చనీయాశంగా మారాయి. కనీస నిల్వల నిబంధన (Minimum Balance Charges) పేరుతో ఖాతాదారుల నుంచి కోట్లాది రుపాయలు తమ ఖాతాలో వేసుకుంటున్న బ్యాంకులపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitharaman) పార్లమెంట్‌కు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఈ వివరాల ప్రకారం మినిమం బ్యాలెన్స్ నింబంధన పేరుతో గడిచిన మూడేళ్లలో (2022-23 నుంచి 2024-25) ప్రైవేటు రంగ బ్యాంకులు ఖాతాదారుల వద్ద నుంచి రూ.11 వేల కోట్లు వసూలు చేయగా ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ.8 వేల కోట్లు వసూలు చేసినట్లు కేంద్రం పార్లమెంట్‌కు వెల్లడించారు.

టాప్‍లో ఉన్న బ్యాంకులు ఇవే:

మినిమం బ్యాలెన్స్ పేరుతో ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో హెచ్‍డీఎఫ్‍సీ అత్యధికంగా రూ. 3800 కోట్లు ఖాతాదారుల నుంచి వసూలు చేయగా ఆ తర్వాత యాక్సిస్ బ్యాంకు రూ. 2700 కోట్లు, ఐసీఐసీఐ బ్యాంకు రూ. 1200 కోట్లు వసూలు చేసినట్లు వెల్లడించారు. ఇక తామెందుకు తక్కువ అన్నట్లు ప్రభుత్వ రంగ బ్యాంకుసు సైతం కస్టమర్లకు చార్జీల మోత మోగిస్తున్నాయి. అత్యధికంగా పంజాబ్ నేషనల్ బ్యాంకు రూ. 1500 కోట్లు వసూలు చేయగా బ్యాంక్ ఆఫ్ బరోడా రూ. 1200 కోట్లు, ఇండియన్ బ్యాంక్ రూ. 1100 కోట్లు వసూలు చేశాయి. అయితే 2020 మార్చి నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రం ఈ మినిమం బ్యాలెన్స్ పేరుతో చార్జీలు వసూలు చేయడం లేదు. ఆ తర్వాత ఎస్‍బీఐ బాటలోనే పంజాబ్ నేషనల్ బ్యాంకు, కెనరా బ్యాంక్ వంటి మరో తొమ్మిది ప్రభుత్వ రంగ బ్యాంకులు గత సంవత్సరం నుండి సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలకు ఇటువంటి ఛార్జీలను తొలగించాయి.

Next Story