- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Chardham Yatra: ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు.. చార్‌ధామ్ యాత్రకు బ్రేక్
చార్‌ధామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేసినట్టు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి తెలిపారు.

దిశ, నేషనల్ బ్యూరో: చార్‌ధామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేసినట్టు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి (Pushkar Singh) Dhami తెలిపారు. ప్రతికూల వాతావరణం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. గురువారం ఆయన హరిద్వార్ లో మీడియాతో మాట్లాడారు. పర్యాటకుల భద్రత దృష్యా యాత్రను టెంపరరీగా నిలిపివేస్తున్నట్టు చెప్పారు. వాతావరణం అనుకూలంగా మారిత తర్వాత యాత్రను తిరిగి కొనసాగిస్తామని తెలిపారు. సందర్శకుల భద్రతకే తొలి ప్రాధాన్యత ఇస్తామని, యాత్ర టైంలో సహాయక చర్యలు చేపట్టడానికి రెస్క్యూ టీమ్స్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేశారు. కాగా, ప్రస్తుతం ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ కారణంగా పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో గత సోమవారం 24 గంటల పాటు అధికారులు యాత్రను నిలిపివేశారు. అప్పటి నుంచి పరిస్థితులు అనుకూలించకపోవడంతో తాత్కాలికంగా యాత్రను నిలిపివేశారు.






