Char Dam Ytra: చార్ ధామ్ హెలికాప్టర్ సేవలకు బ్రేక్

by Prasad Jukanti |

చార్ ధామ్ హెలికాప్టర్ సేవలకు బ్రేక్ పడింది

Char Dam Ytra: చార్ ధామ్ హెలికాప్టర్ సేవలకు బ్రేక్
X

దిశ, డైనమిక్ బ్యూరో: భారత్-పాక్ మధ్య ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో చార్ ధామ్ యాత్ర (Char Dham Yatra) విషయంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం (Uttarakhand Government) కీలక నిర్ణయం తీసుకుంది. బాబా కేదార్‌నాథ్‌తో సహా చార్ ధామ్ యాత్రకు సంబంధించిన అన్ని హెలికాప్టర్ సేవలను తదుపరి నోటీసు వచ్చేవరకు నిలిపివేసింది. భారత్ లోని ఆలయాలు, సామాన్య పౌరులే టార్గెట్ గా పాక్ ఆర్మీ జరుపుతున్న దాడుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా కేదార్‌నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రిలకు అన్ని హెలీ సర్వీసులను నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. మరో వైపు ఈ యాత్రపై స్పందించిన ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ.. ఈ తొమ్మిది రోజుల్లో 4 లక్షలకు పైగా భక్తులు చార్ దామ్ యాత్రలో పాల్గొన్నట్లు వెల్లడించారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ యేడాది కూడా భక్తులు దేవ భూమిని సందర్శించేందుకు మా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని తెలిపారు.

Next Story