Delhi Dust Storm: ఢిల్లీలో డస్ట్ స్ట్రోమ్ బీభత్సం.. 205 విమాన సర్వీసులు ఆలస్యం

by Shamantha N |

Delhi Dust Storm: ఢిల్లీలో డస్ట్ స్ట్రోమ్ బీభత్సం.. 205 విమాన సర్వీసులు ఆలస్యం
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీలో డస్ట్ స్ట్రోమ్ బీభత్సం సృష్టించింది. కొన్ని ప్రాంతాల్లో ఈదురు గాలులు వీస్తూ.. దుమ్ము తుపానుతో పాటు మోస్తారు వర్షం కురిసింది. ఈ క్రమంలో దుమ్ము, ధూళితో కూడిన గాలులు వీయడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విమాన రాకపోకలపై ఈదురుగాలుల ఎఫెక్ట్‌ పడింది. ప్రతికూల వాతావరణం కారణంగా దాదాపు 205 విమాన సర్వీసులు ఆలస్యంగా నడిచాయి. దాదాపు 50 విమాన సర్వీసులను దారి మళ్లించినట్లు ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఎయిరిండియా, ఇండిగో విమానయాన సంస్థలు తమ ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేశాయి. కాగా.. విమానాల రాకపోకల ఆలస్యం కారణంగా ఎయిర్‌పోర్టులోని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దాదాపు 12 గంటలుగా విమానాశ్రయంలోనే వేచి చూసినట్లు ఒక మహిళ పేర్కొన్నారు. ఈ సందర్బంగా ప్రయాణికులు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా తమ ఆవేదన వ్యక్తం చేశారు. ముంబైకి వెళ్లేందుకు ఢిల్లీ విమానాశ్రయానికి వచ్చామని.. ఉదయం 12 గంటలకు బుక్‌ చేసుకున్న విమానం కాకుండా మరొకటి ఎక్కాలని అధికారులు సూచించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఫ్లైట్ ఎక్కాడ అందులోనే నాలుగు గంటలు కూర్చోబెట్టి తర్వాత దింపేసినట్లు తెలిపారు. ఇక, శ్రీనగర్ నుండి ఢిల్లీకి ముంబైకి కనెక్టింగ్ విమానం ఉంది. దుమ్ము తుఫాను కారణంగా ఆ విమానాన్ని చండీగఢ్ కు మళ్లించారు. అంతర్జాతీయ విమానాశ్రయం అయి ఉండి సరైన సమాచారం ఇవ్వకపోవడంపై ఒక ప్రయాణికుడు ఆగ్రహం వ్యక్తంచేశారు.

రోహిత్ శర్మ..

మరోవైపు.. ఢిల్లీలోని కక్రికెట్‌ స్టేడియంలో ఐపీఎల్‌ మ్యాచ్‌ కోసం ముంబై ఇండియన్స్‌ ప్లేయర్స్‌ ప్రాక్టీస్‌ చేస్తున్న సమయంలో ఈదురుగాలులు వీచాయి. ఈ క్రమంలో ప్లేయర్స్‌ను గ్రౌండ్‌ నుంచి లోపలికి వెళ్లాలని రోహిత్‌ శర్మ హెచ్చరించారు. దీనికి సంబంధించిన సోషల్ మీడియా ఎక్స్ లో వీడియోను షేర్‌ చేశారు దేశ రాజధానిలోని కొన్ని ప్రాంతాల్లో శుక్రవారం ఈదురుగాలులు వీస్తూ మోస్తరు వర్షం కురిసింది. అంతకుముందు.. దుమ్ము తుపాను బీభత్సం సృష్టించింది. బలమైన గాలుల కారణంగా పలుచోట్ల కొన్నిచోట్ల చెట్టు కొమ్మలు విరిగిపడ్డాయి.

Next Story