- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భక్తులకు అలర్ట్.. అయోధ్యలో బాలరాముని ఆలయ దర్శనం సమయాల్లో మార్పులు
అయోధ్యలో బాలరాముడి ఆలయ దర్శన సమయాల్లో మార్పులు చేసినట్లు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రకటించింది.

దిశ, వెబ్ డెస్క్: అయోధ్యలో బాలరాముని ఆలయ దర్శన సమయాల్లో మార్పులు చేసినట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ (Sri Rama Janmabhoomi Teerth Kshetra Trust) ప్రకటించింది. శీతాకాలం ప్రారంభం కావడంతో భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మార్పులు చేశారు. కొత్త షెడ్యూల్ ప్రకారం ఆలయం ఉదయం 6. 30 గంటలకు తెరుచుకుని రాత్రి 8. 30 గంటల వరకు భక్తుల కోసం తెరిచి ఉంచబడుతుంది. మంగళ హారతి, శృంగార హారతి వంటి పూజా కార్యక్రమాల సమయాల్లో కూడా సవరణలు చేశారు.
తాజా షెడ్యూల్ ప్రకారం.. మంగళ హారతి తెల్లవారుజామున 4.30 గంటలకు, శృంగార హారతి 6. 30 గంటలకు, శయన హారతి రాత్రి 9.30 గంటలకు నిర్వహిస్తారు. అలాగే భక్తులకు దర్శనాలు యథావిధిగా ఉదయం 7 గంటలకు మొదలై.. రాత్రి 8. 30 గంటల వరకు భక్తులను ఆలయంలోనికి అనుమతించనున్నారు. కావున ఆయోద్యకు వచ్చే భక్తులు ఈ మార్పులను దృష్టిలో పెట్టుకొని ప్లాన్ చేసుకొవాలని, సమయం ముగిసిన తర్వాత వచ్చి ఇబ్బందులు పడవద్దని ఈ సందర్భంగా శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ స్పష్టం చేసింది.






