- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Blood Moon: ఎరుపు రంగులో కనువిందు చేసిన చంద్రుడు
2026 సంవత్సరపు మొదటి ఖగోళ అద్భుతం నేడు ఆవిష్కృతం అయింది.

దిశ, వెబ్‌డెస్క్: 2026 సంవత్సరపు మొదటి ఖగోళ అద్భుతం(Chandra Grahan) నేడు ఆవిష్కృతం అయింది. మార్చి 03, 2026న ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాలతో పాటు భారతదేశంలోనూ చంద్రగ్రహణం ఏర్పడింది. ఈ అరుదైన దృశ్యాన్ని ఖగోళ ప్రేమికులు ఆసక్తిగా తిలకించారు. ఎరుపు రంగులో చంద్రుడు కనువిందు చేశాడు. మంగళవారం మధ్యాహ్నం 03:20 గంటలకు ప్రారంభమైన గ్రహణం.. సాయంత్రం 06:47 గంటలకు ముగిసింది.
ఏమిటీ గ్రహణం?
సూర్యుడు, చంద్రుడి మధ్యకు భూమి వచ్చినప్పుడు ఏర్పడే నీడ చంద్రుడిపై పడటాన్ని చంద్రగ్రహణం అంటారు. భూమి నీడ చంద్రుడిని పూర్తిగా కప్పేస్తే దానిని సంపూర్ణ చంద్రగ్రహణమని, కొంత భాగమే కప్పితే పాక్షిక గ్రహణమని పిలుస్తారు. ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో చంద్రోదయ సమయాన్ని బట్టి గ్రహణం కనిపించే వ్యవధిలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. చాలా ప్రాంతాల్లో గ్రహణం చివరి దశలో ఉండగా చంద్రోదయం జరిగింది. గ్రహణం ఏర్పడుతున్న నేపథ్యంలో భారతదేశంలో ఆధ్యాత్మికంగా 'సూతక కాలం' ప్రాధాన్యత సంతరించుకుంది. ఆలయాల మూసివేత, గ్రహణ నియమాలపై భక్తులు ఆసక్తి చూపారు. అయితే, ఇది పగటిపూట ప్రారంభమై సాయంత్రం ముగుస్తున్నందున, ఆయా ప్రాంతాల్లో కనిపించే సమయాన్ని బట్టి నియమాలు పాటించాలని పండితులు సూచించారు. శాస్త్రీయ కోణంలో చంద్రగ్రహణాన్ని చూడటం వల్ల కళ్లకు ఎటువంటి ప్రమాదం ఉండదు. ఈ అద్భుత దృశ్యాన్ని నేరుగా కళ్లతో వీక్షించవచ్చని కూడా సూచనలు చేశారు.






