- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఢిల్లీ బ్లాస్ట్ ఎఫెక్ట్.. చాందినీ చౌక్ మార్కెట్, లాల్ ఖిలా మెట్రో స్టేషన్ మూసివేత
ఢిల్లీ నగరాన్ని ఉలిక్కిపడేలా చేసిన పేలుడు ఘటనపై దర్యాప్తు వేగం పెరిగింది.

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ నగరాన్ని ఉలిక్కిపడేలా చేసిన పేలుడు ఘటనపై దర్యాప్తు వేగం పెరిగింది. ఎర్రకోట (Red Fort) సమీపంలో జరిగిన పేలుడు నేపథ్యంలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) అధికారులు అనేక కోణాల్లో విచారణను కొనసాగిస్తున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా ఎర్రకోటను భద్రతా బలగాలు అష్టదిగ్భందనం చేసినట్లు కనిపిస్తోంది. భారీ సంఖ్యలో సీఆర్పీఎఫ్, ఢిల్లీ పోలీస్, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది విధుల్లో కొనసాగుతున్నారు. ఎర్రకోటకు వెళ్లే ప్రధాన మార్గాల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. కోట సమీపంలోని రహదారులు మూసివేయగా, చాందినీ చౌక్ మార్కెట్‌తో పాటు (రెడ్ ఫోర్ట్) లాల్ ఖిలా మెట్రో స్టేషన్‌ను తాత్కాలికంగా మూసివేసినట్లు ఢిల్లీ మెట్రో సంస్థ ప్రకటించింది. లాల్ ఖిలా మెట్రో స్టేషన్ రేపటి వరకు మూసి ఉంచుతున్నట్లు సంస్థ తెలియజేసింది. ప్రస్తుతం ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో పోలీసుల కఠిన నిఘా కొనసాగుతోంది.
సోమవారం సాయంత్రం 6.52 గంటల సమయంలో ఈ పేలుడు సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. ప్రారంభ దర్యాప్తులో, హర్యానాలోని ఫరీదాబాద్‌లో భారీ ఎత్తున పేలుడు పదార్థాలు స్వాధీనం కావడం, ఢిల్లీలో డాక్టర్ ఉమర్ నబీ నడిపిన ఐ20 కారులో డిటోనేటర్లు పేలడం వంటి అంశాలు బయటకు రావడంతో కుట్ర కోణం మరింత బలపడింది. ఇదే కేసులో జైషే మహ్మద్‌కు చెందిన మహిళా కమాండర్‌గా గుర్తించిన డాక్టర్ షాహిన్‌ను పోలీసులు విచారిస్తున్నారు. ఆమె గత రెండేళ్లుగా పేలుడు పదార్థాలు నిల్వ చేస్తున్నట్లు సమాచారం. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం (UAPA), పేలుడు పదార్థాల చట్టం, భారతీయ శిక్షాస్మృతిలోని పలు సెక్షన్ల కింద ఢిల్లీ పోలీసులు కేసులు నమోదు చేశారు.






