- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సంచలన నిర్ణయం.. ఆరు జాతి కుక్కలపై నిషేధం
ప్రమాదకరమైన కుక్కల బారి నుంచి ప్రజలను రక్షించేందుకు చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: ప్రమాదకరమైన కుక్కల బారి నుంచి ప్రజలను రక్షించేందుకు చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. అమెరికన్ బుల్ డాగ్, అమెరికన్ పిట్ బుల్, బుల్ టెర్రియర్ సహా ఆరు జాతుల కుక్కలను పెంచడాన్ని నిషేధిస్తూ జీఓ జారీ చేసింది. వీటిలో కేన్ కోర్సో, డోగో అర్జెంటీనో, రోట్ వీలర్ ఉన్నాయి. ఇప్పటికే ఈ జాతుల కుక్కలను పెంచుతున్న వారికి మాత్రం ఈ నోటిఫికేషన్ నుంచి మినహాయింపు ఉంటుందని స్పష్టం చేసింది. 'మునిసిపల్ కార్పొరేషన్ చండీగఢ్ పెంపుడు జంతువులు మరియు కమ్యూనిటీ కుక్కల బై-లాస్ 2025' ను నోటిఫై చేసింది.
నోటిఫికేషన్ ప్రకారం.. ప్రజల భద్రత దృష్ట్యా దూకుడుగా వ్యవహరించే, ప్రమాదకరమైనవిగా పరిగణించబడే కొన్ని జాతుల కుక్కలను చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నిషేధించారు. ఇప్పటికే ఆయా జాతుల కుక్కలను కలిగి ఉన్న యజమానులు మాత్రం 45 రోజుల్లోగా రిజిస్టర్ చేయించుకోవాలని సూచించింది. ఆ తర్వాత నిషేధిత కుక్కలను పెంచుతున్న వారు రిజిస్టర్ చేసుకోలేదని గుర్తించినా, వాటిని కొత్తగా తీసుకొచ్చినట్లు తెలిసినా.. జరిమానా విధిస్తామని చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ జారీ చేసిన నోటిఫికేషన్లో పేర్కొంది. కాగా.. ఆయా కుక్కల్ని పెంచేవారు వాటి మూతికి ఎప్పుడూ పట్టీ వేసి ఉంచాలని, సొంత స్థలంలో తప్ప.. ఇతర నివాస ప్రాంతాలు, గ్రీన్ బెల్టులు, పార్కులు, వీధులు, రోడ్లు, రోడ్ బెర్మ్ లు, ఇతర సాధారణ ప్రాంతాల్లో బహిరంగ మలవిసర్జనకు అనుమతి లేదని పేర్కొంది.






