- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉచిత రేషన్.. కేంద్ర సర్కార్ కీలక నిర్ణయం
by velandi.Saikiran |
ఉచిత రేషన్ కింద ఇచ్చే బియ్యాన్ని ఫోర్టిఫీకేషన్ చేసే ప్రాసెస్ ను మోడీ ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది.

X
దిశ, వెబ్ డెస్క్: కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉచిత రేషన్ కింద ఇచ్చే బియ్యాన్ని ఫోర్టిఫీకేషన్ చేసే ప్రాసెస్ ను మోడీ ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ బియ్యాన్ని ఎక్కువ కాలం స్టోర్ చేసినప్పుడు అందులోని పోషక విలువలు తగ్గిపోతున్నట్లు ఐఐటి ఖరగ్పూర్ స్టడీలో తేలిందని సమాచారం అందుతోంది.
మరింత మెరుగైన పద్ధతిలో పోషకాలను అందించే విధానాన్ని గుర్తించే వరకు ఈ ప్రాసెస్ ను ఆపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే రేషన్ కోటలో మాత్రం ఎలాంటి తగ్గింపు ఉండబోదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. ఇది ఇలా ఉండగా.. తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు కలిగిన వాళ్లకు ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున బియ్యం అందిస్తున్నారు. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పంపిణీ జరుగుతోంది.
Next Story






