- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేశంలో జనాభా వృద్ధిపై కేంద్రం బిగ్ డెసిషన్.. అమిత్ షా కీలక ప్రకటన
భారతదేశంలో జనాభా మార్పులపై మోడీ సర్కార్ మరో కీలక అడుగు వేసింది.

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో మారుతున్న జనాభా సమీకరణాలు, వృద్ధి వల్ల ఉత్పన్నమవుతున్న సామాజిక, ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ కీలకమైన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న జనాభా మార్పులను సమగ్రంగా అధ్యయనం చేసి, తగిన సిఫార్సులు చేయడం కోసం రిటైర్డ్ జస్టిస్ నావలేకర్ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని (High-Level Committee) ఏర్పాటు చేసినట్లుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) ఇవాళ ప్రకటించారు. ఇటీవలి కాలంలో దేశంలోని కొన్ని నిర్దిష్ట సరిహద్దు ప్రాంతాలు, రాష్ట్రాల్లో జనాభా సమతుల్యతలో వస్తున్న వ్యత్యాసాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
వికసిత భారత్ లక్ష్యంగా..
ఈ కమిటీ ఏర్పాటుకు సంబంధించి హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. దేశం ‘వికసిత భారత్’ దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో దేశ వనరులు, జనాభా వృద్ధి మధ్య సమతుల్యత ఎంతో అవసరమని పేర్కొన్నారు. వేగంగా జరుగుతున్న జనాభా మార్పులు, వాటి వల్ల స్థానిక మౌలిక సదుపాయాలు, సామాజిక భద్రత, జాతీయ భద్రతపై పడే ప్రభావాలను ఈ ఉన్నత స్థాయి కమిటీ లోతుగా పరిశీలిస్తుంది. జనాభా నియంత్రణతో పాటు అభివృద్ధి ఫలాలు అందరికీ సమానంగా అందేలా విధానపరమైన సిఫార్సులను ఈ కమిటీ ప్రభుత్వానికి అందించనుందని పేర్కొన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జనన రేట్లు, వలసలు (Migration), స్థానిక జనాభాలో వస్తున్న మార్పుల డేటాను ఈ కమిటీ నిపుణుల సహాయంతో విశ్లేషించనుంది. భవిష్యత్తులో పెరగబోయే జనాభాకు అనుగుణంగా విద్య, వైద్యం, ఉపాధి అవకాశాల కల్పనకు ఎలాంటి వ్యూహాలు అవసరమో కేంద్ర ప్రభుత్వానికి రోడ్‌మ్యాప్ అందించనున్నట్లుగా తెలుస్తోంది.






