Amarnath Yatra: అమర్ నాథ్ యాత్ర నేపథ్యంలో పటిష్ఠ బందోబస్తు

by Shamantha N |

అమ‌ర్‌నాథ్ యాత్ర‌(Amarnath Yatra) త్వరలో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో జమ్ముకశ్మీర్ లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఈ మేర‌కు కేంద్ర హోంశాఖ నిర్ణ‌యం తీసుకున్న‌ది.

Amarnath Yatra: అమర్ నాథ్ యాత్ర నేపథ్యంలో పటిష్ఠ బందోబస్తు
X

దిశ, నేషనల్ బ్యూరో: అమ‌ర్‌నాథ్ యాత్ర‌(Amarnath Yatra) త్వరలో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో జమ్ముకశ్మీర్ లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఈ మేర‌కు కేంద్ర హోంశాఖ నిర్ణ‌యం తీసుకున్న‌ది. కేంద్ర సాయుధ పోలీసు ద‌ళాల‌కు(సేఏపీఎఫ్‌) చెందిన సుమారు 581 కంపెనీల సిబ్బందిని మోహ‌రించ‌నున్నారు. ఇప్పటికే జమ్ముకశ్మీర్ లో ఇప్పటికే 156 కంపెనీలు మోహరించాయి. వీటిలో 91 సీఆర్పీఎఫ్ (CRPF), 13 బీఎస్ఎఫ్ (BSF), ఇతర సీఏపీఎఫ్(CAPF)ల యూనిట్లు ఉన్నాయి. మరో 425 కంపెనీల బ‌ల‌గాల‌ను కేంద్ర పాలిత ప్రాంతానికి పంపించారు. ఇక మిగితా 80 కంపెనీల ద‌ళాలు ఆప‌రేష‌న్ సింధూర్ స‌మ‌యంలో అక్క‌డ‌కు పంపారు. వాళ్ల‌ను కూడా వివిధ లొకేష‌న్ల‌కు మార్చుతున్న‌ట్లు చెప్పారు. అమ‌ర్‌నాథ్‌ యాత్రికుల‌కు పూర్తి స్థాయి ర‌క్ష‌ణ క‌ల్పిస్తున్న‌ట్లు కేంద్ర బ‌ల‌గాలు పేర్కొన్నాయి. త‌క్ష‌ణ‌మే కేంద్ర బ‌ల‌గాలు జ‌మ్ముక‌శ్మీర్‌లో పొజిష‌న్ తీసుకోవాల‌ని ఆదేశాలు జారీ చేసిన‌ట్లు కేంద్ర హోంశాఖ అధికారులు తెలిపారు. పహెల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో జ‌మ్ముక‌శ్మీర్‌లో భారీ భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేస్తున్నారు. సీఏపీఎఫ్‌కు చెందిన అయిదు కంపెనీల్లో సీఆర్పీఎఫ్‌, బీఎస్ఎఫ్‌, సీఐఎస్ఎఫ్‌, ఐటీబీపీ, ఎస్ఎస్బీ ఉన్నాయి. కాగా.. జూలై 3 నుంచి ఆగ‌స్టు 9న వ‌ర‌కు ఆ యాత్ర జ‌ర‌గ‌నున్న‌ది. అమ‌ర్‌నాథ్ యాత్ర‌కు రెండు మార్గాల్లో వెళ్తారు. అనంత్‌నాగ్ జిల్లాలోని పెహల్గామ్ దారి 48 కిలోమీట‌ర్లు ఉంటుంది. ఇక గందేర్‌బ‌ల్ జిల్లాలోని బ‌ల్తాల్ రూట్‌లో 14 కిలోమీట‌ర్లు ప్ర‌యాణం చేయాల్సి ఉంటుంది.

Next Story