- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘యూజర్‌నేమ్స్’ ఫీచర్‌పై కేంద్రం సమీక్ష.. 20 రోజుల్లో కొత్త రూల్స్ వచ్చే అవకాశం!
వాట్సాప్, టెలిగ్రామ్ యాప్‌లలో యూజర్‌నేమ్స్ ఫీచర్‌పై కేంద్రం కీలక సమీక్ష చేపట్టింది.

దిశ, వెబ్‌డెస్క్: యూజర్ నేమ్ (User Name) ఆధారంగా చాట్ చేసుకునే ఫీచర్‌పై కేంద్ర ప్రభుత్వం పంపిన నోటీసులకు వాట్సాప్ (Whatsaao), టెలిగ్రామ్ (Teligram) నుంచి సమాధానాలు అందాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాల యాప్‌లలో భద్రతను మరింత కఠినతరం చేసేందుకు అడుగులు పడుతున్నాయి. రాబోయే 20 రోజుల్లో యూప్‌ల వ్యవహారంపై ఓ స్పష్టమైన యూనిఫాం రూల్స్ తీసుకొస్తూ నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని కేంద్ర వర్గాలు వెల్లడించాయి.
స్పెషల్ లీగల్ టీమ్ పరిశీలన..
వాట్సాప్, టెలిగ్రామ్‌తో పాటు జోహో భారత్ ఐ (Zoho Bharat Eye) సంస్థలు కూడా ప్రభుత్వం పంపిన నోటీసులకు తమ సమాధానాలను సమర్పించాయి. ఈ సమాధానాల్లో ఏవైనా చట్టపరమైన ఉల్లంఘనలు ఉన్నాయా లేదా అనే కోణంలో ఐటీ మంత్రిత్వ శాఖకు చెందిన ప్రత్యేక లీగల్ టీమ్ పరిశీలిస్తోంది. ఈ సందర్భంగా ఐటీ శాఖ సెక్రటరీ ఎస్.కృష్ణన్ మాట్లాడుతూ.. గత వారమే తమకు కంపెనీల నుంచి సమాధానాలు వచ్చాయని తెలిపారు. ప్రస్తుతం తమ టీమ్ వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తోందని.. అనంతరం యాప్‌ల విషయంలో చట్టప్రకారం ఎలాంటి చర్యలు తీసుకోవాలో నిర్ణయిస్తామని స్పష్టం చేశారు. మరోవైపు ఇదే అంశంపై కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ.. రాబోయే 20 రోజుల్లో మెసేజింగ్ యాప్స్ నిబంధనలకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై నిఘా పెంచడంతో పాటు వినియోగదారులకు మరింత సురక్షితమైన ఆన్‌లైన్ వాతావారణాన్ని కల్పించడమే తమ లక్ష్యమని అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు.
కేంద్రం ఆందోళన ఇదే..
కాగా, ఫోన్ నంబర్లు లేకుండా కేవలం యూజర్ నేమ్స్ ద్వారా మెసేజ్‌లు పంపుకునే సదుపాయం వల్ల వినియోగదారుల వ్యక్తిగత వివరాలు గోప్యంగా ఉంటాయని యాప్‌లు చెబుతున్నప్పటికీ, దీంతో భద్రతా పరమైన ముప్పులు ఎక్కువగా ఉన్నాయని కేంద్రం భావిస్తోంది. ఫోన్ నంబర్లు తెలియకపోవడం వల్ల అవతలి వ్యక్తి గుర్తింపును సులభంగా దాచవచ్చని వాదిస్తోంది. దానిని ఆసరాగా చేసుకుని హ్యాకర్లు సులభంగా అవతలి వ్యక్తులను మోసం చేసే అవకాశం ఉంది. ఇక ఇటీవలి కాలంలో దేశాన్ని వణికిస్తున్న డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లు, ఐడెంటిటీ థెఫ్ట్ వంటి నేరాలకు ఈ యూజర్‌నేమ్స్ ఫీచర్ మరింత అజ్యం పోస్తుందని కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది.






