CAPFs: సీఏపీఎఫ్ సిబ్బందికి గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం

by Shamantha N |

వీఐపీలకు భధ్రతనిచ్చే సీఏపీఎఫ్ లోని(CAPF) సిబ్బందికి కేంద్రం ప్రత్యేక అలవెన్స్ మంజూరు చేసింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

CAPFs: సీఏపీఎఫ్ సిబ్బందికి గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం
X

దిశ, నేషనల్ బ్యూరో: వీఐపీలకు భధ్రతనిచ్చే సీఏపీఎఫ్ లోని(CAPF) సిబ్బందికి కేంద్రం ప్రత్యేక అలవెన్స్ మంజూరు చేసింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జెడ్ ప్లస్ (ఏఎస్ఎల్), జెడ్ ప్లస్ కేటగిరీ కింది వీఐపీలకు సీఏపీఎఫ్ సిబ్బంది సాయుధ రక్షణ కల్పిస్తారు. జెడ్, వైప్లస్, వై, ఎక్స్ కేటగిరీ భద్రత కల్పించే సిబ్బందికి మాత్రం అలవెన్సు లభించదని అధికారులు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ భద్రతా ప్రోటోకాల్ కింద తక్కువ శ్రేణి భద్రత కల్పించే సిబ్బందికి ఇవి వర్తించవని తెలిపారు. వీఐపీ భద్రతా విధుల్లో నిమగ్నమైన సీఏపీఎఫ్ సిబ్బందికి ప్రాథమిక వేతనంలో 20 శాతం ప్రత్యేక భద్రతా భత్యం (SSA) మంజూరు చేయడానికి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతిపాదనను పరిశీలించిందని అధికారులు పేర్కొన్నారు. సీఏపీఎఫ్ యూనిట్ కు చెందిన 350 మంది సిబ్బంది వీఐపీలకు భద్రత కల్పిస్తున్నాయి. కాగా.. వారిలో 35 మంది మాత్రమే జెడ్ ప్లస్ ఏఎస్ఎల్, జడ్ ప్లెస్ కేటగిరీ కింద పనిచేస్తున్నారు.

Next Story