క్రికెటర్ శిఖర్ ధావన్ ఫౌండేషన్‌కు కేంద్రం ‘గ్రీన్ సిగ్నల్’

by Malleboina Mahesh |

భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ ఫౌండేషన్‌కు FCRA రిజిస్ట్రేషన్! విదేశీ నిధుల సేకరణకు కేంద్ర హోం శాఖ అనుమతి. విద్య, క్రీడల అభివృద్ధికి మరిన్ని నిధులు.

క్రికెటర్ శిఖర్ ధావన్ ఫౌండేషన్‌కు కేంద్రం ‘గ్రీన్ సిగ్నల్’
X

దిశ, వెబ్ డెస్క్: భారత మాజీ స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్ (Shikhar Dhawan) సామాజిక సేవా రంగంలో మరో ముందడుగు వేశారు. ఆయన నేతృత్వంలోని 'శిఖర్ ధావన్ ఫౌండేషన్' (SDF) కు విదేశీ నిధుల సేకరణకు సంబంధించి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (MHA) అధికారికంగా అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు ఫౌండేషన్‌ను ఫారిన్ కాంట్రిబ్యూషన్ (రెగ్యులేషన్) యాక్ట్ (FCRA) కింద రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ రిజిస్ట్రేషన్ ద్వారా ఇకపై ఈ సంస్థ అంతర్జాతీయ దాతల నుంచి విరాళాలు, నిధులను సేకరించి, వాటిని దేశవ్యాప్తంగా వివిధ సామాజిక కార్యక్రమాలకు వెచ్చించే అవకాశం లభించింది.

2022 లో స్థాపించబడిన శిఖర్ ధావన్ ఫౌండేషన్ (Shikhar Dhawan Foundation,), ప్రధానంగా విద్య, ఆరోగ్యం, క్రీడల రంగాల్లో అణగారిన వర్గాల అభివృద్ధికి కృషి చేస్తోంది. ముఖ్యంగా పేద చిన్నారుల చదువు, గ్రామీణ ప్రాంతాల్లో క్రీడల అభివృద్ధి, ఆకలి లేని సమాజం కోసం ఇది నిరంతరం శ్రమిస్తోంది. ఇప్పటివరకు దేశీయ నిధులతోనే కార్యకలాపాలు నిర్వహించిన ఈ సంస్థకు, ఇప్పుడు FCRA లైసెన్స్ రావడంతో విదేశాల్లో ఉన్న భారతీయులు, అంతర్జాతీయ సంస్థల నుండి కూడా సహాయం అందనుంది. ఈ అనుమతిపై శిఖర్ ధావన్ హర్షం వ్యక్తం చేస్తూ, విదేశీ నిధుల ద్వారా మరిన్ని స్వచ్ఛంద కార్యక్రమాలను విస్తృతం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Next Story